పాస్‌పోర్ట్, నిత్యం అవసరమయే వస్తువులను జాగ్రత్తగా సూట్‌కేస్‌లో ప్యాక్ చేసుకుంటున్నారు హీరోయిన్ హ్యూమా ఖురేషి. త్వరలో ఆమె లాస్ ఏంజిల్స్‌కు పయనం కానున్నారు. దాదాపు రెండు నెలలు అక్కడే ఉంటారట.. ‘డ్వాన్ ఆఫ్ ది డెడ్, 300, జస్టిస్ లీగ్’ వంటి ఇంగ్లీష్ చిత్రాలను తెరకెక్కించిన జాక్ స్నైడర్ దర్శకత్వంలో ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ అనే హాలీవుడ్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో డావే బౌటిస్టా, థియో రోసి, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు చేయనున్నారు. కిరాయి సైనికుల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో లాస్ ఏంజిల్స్ను ప్రారంభం కానుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లనున్నారు హ్యూమా.
ఆంగ్ల చిత్రాలతో బిజీ
Related tags :