Movies

ఇది ఒక సైకో సమాజం

I hate this bloody psychotic society says radhika apte

సమాజం ఓ సైకో అంటూ బాలీవుడ్‌ వివాదస్పద నటి రాధిక ఆప్టే ఫైర్‌ అయ్యారు. ఆమె నటించిన ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ అనే హాలీవుడ్‌ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ రాధిక ఘాటు వ్యాఖ్యలు చేశారు. ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో చాలా అద్భుతమైన స‌న్నివేశాలు ఉన్నాయని, కానీ అవ‌న్నీ వ‌దిలేసి కేవ‌లం ఈ ఒక్క సెక్స్ సీన్ మాత్ర‌మే లీక్ చేసారన్నారు. స‌మాజ‌పు మాన‌సిక ప‌రిస్థితికి అద్దం ప‌ట్టే దృశ్యం ఇదేనని మండిపడ్డారు. సొసైటీ నిజంగానే ఓ సైకోలా మారిపోయిందన్నారు. ఆ లీకైన సీన్‌లో తనతో పాటు దేవ్‌పటేల్‌ కూడా ఉన్నారని, కానీ కేవలం రాధికా ఆప్టే సెక్స్ సీన్ అనే ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు దేవ్ ప‌టేల్ సన్నివేశమని ప్ర‌మోట్ చేయ‌రని నిలదీశారు.ఇక రాధిక ఆప్టేకు సంబంధించిన బోల్డ్‌ సీన్‌లు లీకవ్వడం ఇదే తొలిసారి కాదు. 2016, ఆగస్టులో అదిల్‌ హుస్సెన్‌తో సాన్నిహిత్యంగా ఉన్న సన్నివేశాలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ తరహా సన్నివేశాలపై రాధిక ఆప్టే కూడా బోల్డ్‌గానే స్పందించారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఈ తరహా సన్నివేశాల్లో నటించడానికి తనకేం ఇబ్బందిలేదన్నారు. ‘ బోల్డ్‌ సీన్స్‌లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ప్రపంచ సినిమాలు చూస్తూనే పెరిగాను.. అలాగే ఎంతో దూరం ప్రయాణించాను. నా శరీరంతో నేను సౌకర్యంగానే ఉన్నాను. భారత్‌, ఇతర దేశాల్లో న్యూడ్‌గా నటించడం నేను చూశాను. బోల్డ్‌ సీన్స్‌లో నా శరీరాన్ని చూసుకొని నేనేం సిగ్గుపడటం లేదు. అవమానంగా ఫీలవ్వడం లేదు. అది ఒక వస్తువులాంటిదే. దాన్ని నేను నా నటనకు ఉపయోగిస్తున్నాను.’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ది వెడ్డింగ్‌ చిత్రాన్ని మైఖెల్‌ వింటర్‌ బాటమ్‌ తెరకెక్కిస్తుండగా.. జిమ్ సర్బ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.