భారతదేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల పరిణామాలు లోతుగా పరిశీలిస్తే ప్రధాని మోడీ అంటే భయం పోయిందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా రాహుల్ గాంధీ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారని NRI TPCC కోర్ కమిటీ సభ్యులు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. డల్లాస్‌లోని టయోటా మ్యుజిక్ ఫ్యాక్టరీలో ఎన్నారై కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఆ కార్యక్రమ అనంతరం NRI TPCC సభ్యులతో ముచ్చటించారు.
ఇందులో భాగంగా రాహుల్‌ను కలిసిన చంద్రశేఖర్, ప్రవాస భారతీయులతో ముచ్చటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి NRI విభాగం తరఫున మరింతగా కృషి చేస్తామని రాహుల్‌కు తెలిపారు. దేశానికి, పార్టీకి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని రాహుల్ కొనియాడారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z