NRI-NRT

GWTCS 50 టెస్లా కార్ల డాన్స్ షోతో వినూత్న ప్రచారం

GWTCS 50 టెస్లా కార్ల డాన్స్ షోతో వినూత్న ప్రచారం

27, 28 తేదీల్లో డీసీలో నిర్వహిస్తున్న బృహత్తర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS50) స్వర్నోత్సవాల ప్రచారాన్ని ఈసారి వినూత్నంగా నిర్వహించారు. వందలాది టెస్లా కార్లతో నిర్వహించిన డాన్స్ షో సరికొత్త రీతిలో ఆకట్టుకుంది. టెస్లా కార్ల సాంకేతికతను ఉపయోగించి, సాంప్రదాయ పాటలతో జత కలిపి మిరుమిట్లు గొలిపే లైట్లతో చేసిన ప్రదర్శన నవీన అనుభూతిని మిగిల్చిందని అధ్యక్షులు కృష్ణ లాం తెలిపారు.

కార్యవర్గ సభ్యులు, కృష్ణ గుడిపాటి టీమ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచారు. అన్ని తరాలవారిని ఆకట్టుకునే విధంగా గత ఆరు వారాల నుండి వివ్ధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వేడుకల విజయవంతానికి ప్రవాసులు విరివిగా తరలిరావాలని ఆయన కోరారు. వివరాలకు https://www.gwtcs50.org చూడవల్సిందిగా కోరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z