Movies

సుహాసినికి పోకిరీల వేధింపులు..తుపాకీతో బెదరగొట్టిన చిరంజీవి

సుహాసినికి పోకిరీల వేధింపులు..తుపాకీతో బెదరగొట్టిన చిరంజీవి

ఇండస్ట్రీలోని బెస్ట్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో చిరంజీవి-సుహాసిని మొదటి స్థానంలోనే ఉంటారు. 1980 – 1990ల్లో వీళ్లిద్దరూ ఎన్నో సినిమాలతో అలరించారు. తాజాగా మెగాస్టార్‌ను (Chiranjeevi) సుహాసిని ప్రశంసించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో వీడియో కాల్‌లో చిరుతో మాట్లాడుతున్న సుహాసిని (Suhasini Maniratnam) వాళ్ల సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ సంఘటనను ఆయనకు గుర్తుచేశారు.

‘చిరంజీవి నా హీరో. అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఒకసారి మేం షూటింగ్‌ కోసం కేరళలోని ఓ ప్రాంతానికి వెళ్లాం. ముందు కారులో చిరంజీవి వెళ్తున్నారు. వెనక కారులో నేను, డ్యాన్స్‌ మాస్టర్, హెయిర్‌ డ్రెస్సర్‌ ఉన్నాం. అనుకోకుండా కొందరు తాగుబోతులు మా కారును వెంబడించారు. కారుపై బీరు బాటిల్స్‌ వేశారు. ఇది చూసిన చిరంజీవి.. వెంటనే తన కారు దిగి వాళ్లను గన్‌తో బెదిరించారు. దీంతో వాళ్లంతా పారిపోయారు. హీరోయిజం అంటే కెమెరా ముందే కాదు.. రియల్‌ లైఫ్‌లో కూడా అలానే ఉండడం’ అంటూ చిరుపై ప్రశంసలు కురిపించారు. ‘ఈ సంఘటన మీకు గుర్తుందా’ అని చిరంజీవిని సుహాసిని (Suhasini) అడగ్గా.. ‘గుర్తుంది. వాళ్లు మిమ్మల్ని వెంబడించడం అనూహ్య పరిణామం’ అని మెగాస్టార్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోను చిరు అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఈ వీడియో ఎప్పటిది.. పూర్తి వీడియోను షేర్‌ చేయండి అని మరికొందరు కామెంట్స్‌లో అడుగుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z