టంపా బే నాట్స్ విభాగం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించింది. స్థానిక మాటా(మన అమెరికన్ తెలుగు అసోషియేషన్)తో కలిసి తొమ్మిది రోజుల పాటు ఈ వేడుక పర్యావరణ హితంగా అయ్యప్ప సొసైటీ ఆఫ్ టంపాలో నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు వివిధ పూజలు, హోమాలు, వ్రతాలు నిర్వహించారు. వీటితో పాటు సంప్రదాయ నృత్యాలు (భరతనాట్యం, కథక్), గానం, సంగీత ప్రదర్శనలు, సంగీతాలయ సమర్పణలు, కవిత గాన లహరి, నందలాల్ యూత్ సంగీత కచేరీలు, సాయి భజనాలు, అన్నమాచార్య కీర్తనలు, గణేష్ విగ్రహాల తయారీకి సంబంధించిన వర్క్‌షాప్‌లు నిర్వహించారు. లడ్డూ వేలం ఆన్‌లైన్‌లో నిర్వహించగా $10,116 డాలర్లకు ప్రవాసులు కొనుగోలు చేశారు.
నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాటా చాప్టర్ ప్రెసిడెంట్ టాని జాను, నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యదర్శి రాజేష్ కాండ్రు, ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఈస్ట్ సుమంత్ రామినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ అరికట్ల, సురేష్ బొజ్జా, విజయ్ కట్టా, కోర్ టీమ్ కమిటీ శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, భార్గవ్ మాధవరెడ్డి, అనిల్ అరెమండ, భరత్ ముద్దన, మాధవి యార్లగడ్డ, మాలినీ రెడ్డి, సతీష్ పాలకుర్తి, సుధాకర్ మున్నంగి, ప్రసాద్ నేరళ్ల, రవి కలిదిండి, కిరణ్ పొన్నం, నవీన్ మేడికొండ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z