Devotional

Horoscope in Telugu – Sep 25 2024

Horoscope in Telugu – Sep 25 2024

మేషం
తోటి వారి సహాయంతో పనులను పూర్తి చేస్తారు. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తోటి వారి సలహాలతో చక్కటి ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలోని వ్యక్తులను ప్రేమ భావంతో చూడడం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.

వృషభం
ప్రారంభించబోయే పనుల్లో ప్రయత్న బలాన్ని పెంచాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించాలి.

మిథునం
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఎన్ని ఆటంకాలు ఏదైనా మనోధైర్యంతో పూర్తి చేయడానికి తగిన సహాయం అందుతుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం. శ్రీలక్ష్మీ స్తుతి శుభప్రదం.

కర్కాటకం
సంపూర్ణ మనోబలంతో విజయాలు సాధిస్తారు. చాప కింద నీరు లాగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు జాగ్రత్త. కలహాలతో కాలాన్ని వృథా చేయకండి. ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు ఉపకరిస్తాయి. శ్రీగణపతిని ధ్యానించండి.

సింహం
ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. ప్రారంభించబోయే పనిలో అవగాహన లోపం లేకుండా జాగ్రత్త పడాలి‌. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞులు సూచనలను తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. శ్రీ విష్ణుమూర్తి ధ్యానించండి.

కన్య
మీదైన రంగంలో శుభఫలితాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు. బంధుప్రీతి ఉంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివారాధన చేస్తే మరింత విజయం జరుగుతుంది.

తుల
ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్నది సాధించేవరకు పోరాటం ఆపకండి. తోటివారి సహకారంతో పని పూర్తవుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసా చదవండి.

వృశ్చికం
వ్యాపారంలో భక్తిశ్రద్ధలతో పనిచేయడం ద్వారా లాభాలు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ఆటంకాలను అధిగమిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. ప్రయాణాల్లో జాగ్రత్త. అప్పులు ఇబ్బంది పెడతాయి. రుణ విమోచక అంగారక స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది.

ధనుస్సు
శుభకాలం. మీ ఆలోచనల ద్వారా ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం సూచన. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించండి.

మకరం
స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యక్రమాలను పూర్తి చేస్తారు.పెద్దలు ఇచ్చిన సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శివారాధన శుభప్రదం.

కుంభం
మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముందస్తు ప్రణాళికలతో శ్రమ తగ్గుతుంది. వ్యాపార పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది. .

మీనం
అద్భుతమైన కాలం. ఏ పని ప్రారంభించినా విజయంతం అవుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థికంగా బలపడతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు ఫలప్రదం అవుతాయి. శ్రీఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z