Devotional

నెయ్యి కల్తీపై పోలీసులకు తితిదే ఫిర్యాదు-NewsRoundup-Sep 25 2024

నెయ్యి కల్తీపై పోలీసులకు తితిదే ఫిర్యాదు-NewsRoundup-Sep 25 2024

* నటుడు నాగచైతన్య (ణగ ఛైతన్య), నటి శోభితా ధూళిపాళ్ల (శొభిత ఢులిపల) నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ను ఉద్దేశించి తాజాగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఆ ఫంక్షన్‌ జరిగిందని ఆమె తెలిపారు. ‘‘నిశ్చితార్థ వేడుక గ్రాండ్‌గా జరగాలని నేను ఎప్పుడూ ప్రణాళిక, లేదా కలలు కనలేదు. జీవితంలో ముఖ్యమైన ఆ క్షణాలను ఆస్వాదించాలని అనుకున్నా. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఇలాంటి వేడుకలు జరగాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. నా తల్లిదండ్రులు, సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతగానో విలువ ఇస్తారు. వాటితో నేను మమేకమై ఉన్నాను. అనుకున్న విధంగానే సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది. అందమైన క్షణాలతో నా మనసు నిండింది. కాబట్టి, అది నిరాడంబరంగా జరిగిందని అనుకోవడం లేదు. నా వరకూ అది చాలా పర్‌ఫెక్ట్‌గా పూర్తైంది’’ అని శోభితా ధూళిపాళ్ల తెలిపారు.

* వైకాపా నేత అంబటి మురళీకృష్ణకు చెందిన గ్రీన్‌ గ్రేస్‌ అపార్ట్‌మెంట్‌లో మరోసారి తనిఖీలు జరుగుతున్నాయి. నిర్మాణాలకు రైల్వే ఎన్‌వోసీ రద్దు లేఖను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర బయటపెట్టిన విషయం తెలిసిందే. ఎన్‌వోసీ రద్దు చేసిన తర్వాత కూడా నిర్మాణం జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టాభిపురంలోని బహుళ అంతస్తుల నిర్మాణాలను గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు, రైల్వేశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.

* సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ఎక్స్‌ వేదికగా చేస్తున్న పోస్టులు (ప్రకష్ రజ్ త్వీత్) ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను కోట్‌ చేస్తూ మొదలైన ఆయన పోస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలుగులో ఆయన మరో పోస్ట్‌ పెట్టారు. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్‌ ఆస్కింగ్‌…’ అని పేర్కొన్నారు.

* నటుడు మోహన్‌బాబు ఇంట్లో చోరీ జరిగింది. నగర శివారు జల్‌పల్లిలో గల నివాసంలో పనిమనిషి నాయక్‌ రూ.10 లక్షలు దొంగిలించి పారిపోయినట్లు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన రాచకొండ పోలీసులు నాయక్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.

* రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడాం. ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని వారిని అడుగుతున్నాం. నిరుద్యోగ యువత డిమాండ్‌-సప్లయ్‌ సూత్రం గుర్తుంచుకోవాలి’’అని చెప్పారు.

* నెయ్యి కల్తీ ఘటనపై పోలీసులకు తితిదే ఫిర్యాదు చేసింది. ఏఆర్‌ డెయిరీ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి తూర్పు పీఎస్‌లో తితిదే ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారని పేర్కొన్నారు.

* కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆర్థిక స్థోమత, క్రమశిక్షణ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌.. అధికారులను ప్రశ్నించింది. కమిషన్‌ ముందు కాళేశ్వరం కార్పొరేషన్‌ చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ వెంకట అప్పారావు, చీఫ్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ పద్మావతి, డైరెక్ట్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్‌ చీఫ్‌ ఫణిభూషణ్‌ శర్మ బుధవారం హాజరయ్యారు.

* స్టీల్‌ప్లాంట్‌ అంశంపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. ‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారు కదా. పాదయాత్ర సమయంలో నేను కూడా అదే చెప్పాను. గత ఐదేళ్లలో విశాఖ ఉక్కుకు ఏ కొంచెమైనా సాయం జరిగిందా? ప్రైవేటీకరణ యోచనే లేదు’’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

* మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం అత్తాపూర్‌ వద్ద మూసీ నదిలో నిర్మాణాలను ఆర్డీవో వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు మూసీ నదిపై ఉన్న అక్రమ నిర్మాణాలను పరిశీలిస్తున్నారు.

* హరియాణా(హర్యన)లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ (ఫం ంఒది) కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ(భాజపా)కు ప్రజల మద్దతు పెరుగుతోందని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్‌కు ఆశలు సన్నగిల్లుతున్నాయన్నారు.

* దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యత రోజురోజుకు మరింత క్షీణిస్తోంది. నవంబర్‌లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో ఆ నెలలో కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ పేర్కొన్నారు.

* మహారాష్ట్రలోని ఠాణె జిల్లా బద్లాపుర్‌లో ఇటీవల ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై స్వీపర్‌ లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. నిందితుడు రెండు రోజుల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే స్పందించారు. నిందితుడి పట్ల పోలీసుల చర్యను సమర్థించారు.

* ఇజ్రాయెల్‌ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఐరన్‌ డోమ్‌. నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకొంటుంది. ఆకాశంలో క్షిపణులు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్‌ వాసులు ధైర్యంగా తమ పని తాము చేసుకొనేట్లు చేసింది.

* దేవుడిపై నమ్మకం ఉందని జగన్‌ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్‌ తీరును ఎండగట్టారు. ‘‘మీకు దేవుడిపై నమ్మకం లేకపోవచ్చు.. కానీ, ఆ దేవుడిని నమ్మే కోట్లాది మంది ఇక్కడ ఉన్నాం. తిరుమల అంశాన్ని ఒక పొలిటికల్‌ ఈవెంట్‌లా తయారు చేయడం బాధాకరం. దయచేసి మీరు చేసిన పాపాలు చాలు.. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనేది నిజం. అపచారం జరిగిందనేది నిజం. ఎవరూ కాదనలేని వాస్తవాలు. గతంలో తిన్న తిరుపతి లడ్డూకి, ప్రస్తుతం పంపిణీ చేస్తున్న లడ్డూకీ మధ్య తేడా భక్తులను అడిగితే తెలుస్తుంది. అంతకు మించిన పరీక్ష మరొకటి అక్కర్లేదు.

* మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం అత్తాపూర్‌ వద్ద మూసీ నదిలో నిర్మాణాలను ఆర్డీవో వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు మూసీ నదిపై ఉన్న అక్రమ నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. నివాసాలు, దుకాణాల అనుమతుల వివరాలు సేకరిస్తున్నారు. పనులను ప్రారంభించేందుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధమైంది.

* గత కొన్నాళ్లుగా పాకిస్థాన్‌ క్రికెట్‌కు (ఫకిస్తన్ ఛ్రిచ్కెత్) ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వన్డే, టీ20 ప్రపంచకప్‌లో కనీసం సెమీస్‌కు చేరుకోలేదు. ఇటీవల సొంత గడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఓటమిపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కెప్టెన్సీ మార్పులు, పాక్‌ క్రికెట్ బోర్డులో రాజకీయాలు ఎక్కువయ్యాయంటూ మాజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా హైలెవల్‌ కనెక్షన్ క్యాంప్‌ను పీసీబీ నిర్వహించింది. ఈసందర్భంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ ప్రధాన కోచ్‌ గ్యారీ కిరిస్టెన్ స్పందిస్తూ ‘మళ్లీ పాక్‌ గర్వపడేలా చేస్తాం’ అంటూ వ్యాఖ్యానించాడు. వీటిపై పాక్‌ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఎంత చేసినా ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత ఉద్వాసన తప్పదంటూ హెచ్చరించాడు. సీటీలోనూ పాక్‌ టాప్‌-4లో నిలవడం కష్టమేనని వ్యాఖ్యానించాడు.

* రాజకీయాల కోసం చంద్రబాబు దైవాన్ని కూడా వదల్లేదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. పార్టీ నేతలు కొడాలినాని, వల్లభనేనివంశీతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(సెప్టెంబర్‌25) పేర్నినాని మీడియాతో మాట్లాడారు.‘తిరుమలలో నెయ్యిని వెనక్కి పంపామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. చంద్రబాబు, లోకేశ్‌ మాత్రం అబద్ధాలు చెబుతున్నారు.లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. తన కుట్ర రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు.లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడారు.అలాంటిదేమీ లేదని ఈవో శ్యామలరావు చెప్తుంటే చంద్రబాబు అడ్డమైన ఆరోపణలు చేశారు.లోకేష్ అయితే ఏకంగా పందికొవ్వు కలిసిందన్నారు.పవన్ కళ్యాణ్ కూడా అదే దారిలో ఆరోపణలు చేశారు.ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ భావించింది. వారి పాపాలను క్షమించి వదిలేయమని శనివారం(సెప్టెంబర్‌28) రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిస్తున్నాం.శరీరం, ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటే.అందుకే చంద్రబాబు మాట్లాడిన మలినపు మాటలకు పవన్ కూడా వత్తాసు పలికారు.ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇస్తే వాటికి పవన్ కూడా హామీ ఇచ్చారు.బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అమ్మకు రూ.18 వేలు.. ఇలా అనేక హామీలు ఇచ్చారు

* రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని.. మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్‌ ప్రోగ్రామ్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటాలు చేశారని.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది’’ అని సీఎం రేవంత్‌ అన్నారు.‘‘నిరుద్యోగుల దశ, దిశ నిర్దేశించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కార్పొరేషన్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద నిధులు ఇస్తున్నాం. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్‌, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్‌ ఉంది.’’ అని సీఎం రేవంత్‌ తెలిపారు.

* తమ హయాంలో హైదరాబాద్‌ను మురికి నీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీ(మురుగు శుద్ధి కేంద్రం)లను ప్రారంభించామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఫతేనగర్‌ ఎస్టీపీ(మురుగు శుద్ధి కేంద్రం)ని ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులతో కలిసి పరిశీలించారు. వీటి నిర్మాణంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని విమర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. తమ హయాంలో మొత్తం 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రూ.3,866 కోట్లతో మురుగునీటి శుద్ధి కార్యక్రమం ప్రారంభించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటోందని ఎద్దేవా చేశారు. దీని కోసమే రూ.వేలు, లక్షల కోట్లు అంటే అందరికీ అనుమానం వస్తోందన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క అనేక అబద్ధాలు చెప్పారని విమర్శించారు. ఎస్టీపీల పెండింగ్‌ పనులను ఈ ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. హైడ్రా పేరుతో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం జరుగుతోందని చెప్పారు. మరోవైపు కూకట్‌పల్లి ఎస్టీపీని కేటీఆర్‌, భారాస నేతలు పరిశీలించనున్నారు.

* బీసీ ఉద్యమం బలోపేతానికే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయబోతున్నట్లు చెప్పారు. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలన్నారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘వివిధ పద్ధతుల్లో ఉద్యమం చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదు. బీసీల తరఫున చట్టసభల్లో ప్రశ్నించినా సమాధానం రాలేదు. ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉన్నా బీసీల గురించి ఆలోచించే ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ప్రజా ఉద్యమం, బీసీ ఉద్యమమే నా కార్యాచరణ. రాజ్యాధికారంలో వాటాతో పాటు చట్టసభల్లో 50 శాతం సీట్లు ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు ఇచ్చారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలి. బీసీల కోసం చాలా త్యాగాలు చేయాల్సివస్తుంది. గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేయాలని కోరుతున్నాం. అన్ని పార్టీల వారు ఈ ఉద్యమంలోకి రావాలి. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే నా జీవిత లక్ష్యం. దీనికోసం ప్రతి బీసీ బిడ్డా పోరాడాలి’’ అని ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z