NRI-NRT

ఈ అనుభవం మరువలేనిది – GWTCS వేడుకలో అయ్యన్నపాత్రుడు

ఈ అనుభవం మరువలేనిది – GWTCS వేడుకలో అయ్యన్నపాత్రుడు

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS50) స్వర్ణోత్సవాల్లో భాగంగా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుదు-పద్మావతి దంపతులను ఆ సంస్థ అధ్యక్షుడు లాం కృష్ణ నేతృత్వంలో కార్యవర్గ సభ్యులు శనివారం నాడు రెండో రోజు ముగింపు వేడుకల్లో భాగంగా సత్కరించారు. ఇది తనకు మరిచిపోలేని అనుభవమని, గీతమ్స్ ఛైర్మన్ మూర్తి అమెరికాలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైనప్పుడు తెలుగు సంఘాల కృషి అభినందనీయమని అన్నారు. ప్రవాసులకు తితిదేలో ప్రత్యేక దర్శన సౌలభ్యానికి కృషి చేస్తానని అయ్యన్న హామీ ఇచ్చారు. ధూళిపాళ్ల నరేంద్ర తండ్రితో, ఇప్పుడు తనతో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. GWTCS మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

రెండోరోజు మధ్యాహ్నం ఫ్యాషన్ షో, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సినీ నటులు ఆలీ, శర్వానంద్, అంజలిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మణిశర్మ సంగీత విభావరితో వేడుకలకు స్వస్తి పలికారు. కార్యక్రమంలో డా. మూల్పూరి వెంకటరావు, మన్నే సత్యనారాయణ, సాయిసుధ పాలడుగు, కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్, వేమన సతీష్, ప్రదీప్ గౌర్నేని తదితరులు పాల్గొన్నారు.
















👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z