మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): కొన్ని కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. చిన్నా చితకా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య క్షేత్ర సందర్శన చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో వేతనాలకు సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబంలో ఊహించని చికాకులు తప్పకపో వచ్చు. కొద్దిగా అనారోగ్యం చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల ఆఫర్లు అందు తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. సోదరులతో అనుకూలతలు పెరుగుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారులకు మీ పనితీరు సంతృప్తి కలిగిస్తుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తుల వారికి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగుతాయి. తలపెట్టిన ముఖ్యమైన పనులు, వ్యవ హారాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతా వరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యో గులకు కొద్దిపాటి ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పిల్లలు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయ వద్దు. శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పూర్తి చేస్తారు. బంధువుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆదాయానికి ఢోకా ఉండదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో కీలక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. విలువైన వస్తు వులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. బంధువుల జోక్యంతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ బాధ్యతల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. బంధువు లతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆదాయా నికి లోటుండదు కానీ, ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కొద్ది శ్రమతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగం రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. వృత్తి రంగంలోని వారికి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలను పాటించడం మంచిది. ఆర్థిక విషయాలను ఇత రులతో పంచుకోకపోవడం శ్రేయస్కరం. కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుం టారు. చేపట్టిన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇతరుల వ్యక్తిగత వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. అదనపు ఆదాయం ప్రయత్నాల్లో శ్రమ పెరు గుతుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యక్తిగత సమస్యల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z