ప్రముఖ ఈకామర్స్ పోర్టల్ అమెజాన్ అప్పుడప్పుడు బొనాంజా సేల్స్, ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటారు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో తక్కువ ధరలకే వస్తువులను విక్రయిస్తుంటుంది. ఎంత విక్రయించినా ఓ 40లేదా 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. కానీ, అమెజాన్ చేసిన ఓ పొరబాటు కస్టమర్ల పాలిట వరమైంది. కొనుగోలు ధర పేర్కొనాల్సిన చోట అంకెల్లో జరిగిన పొరబాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దాని ఫలితమే రూ.9 లక్షల విలువైన బ్రాండెడ్ కెమెరాను రూ.6,500కే దక్కించుకున్నారు. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో భాగంగా ఓ అత్యాధునిక కెమెరాపై కూడా ఆఫర్ ప్రకటించింది. అయితే, కొనుగోలు ధరను కేవలం రూ.6,500గా పేర్కొనడంతో కస్టమర్లు పండగ చేసుకున్నారు. ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేసుకున్నారు. దీని అసలు ఖరీదు రూ.9 లక్షలు. అలాగే సోనీ ఎ6000 కెమెరాకు కూడా ఇదే గతి పట్టింది. దీని వాస్తవ ఖరీదు రూ.4 లక్షలు కాగా, వినియోగదారులు దీన్ని సైతం అత్యంత చవకగా రూ.6,500కి దక్కించుకున్నారు. అయితే, తాము అత్యంత చీప్ గా కొన్న కెమెరాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టేసరికి అమెజాన్ చూసి అవాక్కయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. భారీ సంఖ్యలో ఖరీదైన కెమెరాలకు రెక్కలొచ్చాయి. చేసేదేమీలేక అప్పటికి బుక్ అయిన ఆర్డర్లను మాత్రం రద్దు చేసిన అమెజాన్ ఉసూరుమంది.
అతి చవకగా అమెజాన్ కెమెరాలు
Related tags :