ScienceAndTech

₹500లకే IIT Madrasలో ఆన్‌లైన్ కోర్సులు-NewsRoundup-Oct 04 2024

₹500లకే IIT Madrasలో ఆన్‌లైన్ కోర్సులు-NewsRoundup-Oct 04 2024

* ధోనీ, రోహిత్ శర్మకు సంబంధించిన విషయాలపై ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌.. తాజాగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీరుపై మాట్లాడాడు. మరీ ముఖ్యంగా టెస్టుల్లో జట్టును నడిపించిన విధానం అద్భుతమని ప్రశంసించాడు. విదేశీ గడ్డపైనా గెలవాలనే కసిని ఆటగాళ్లలో పెంచాడని భజ్జీ వ్యాఖ్యానించాడు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బోర్డర్ – గావస్కర్ 2021/22 ట్రోఫీ అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆటగాడిగానూ అదే దూకుడు కొనసాగించడం అభినందనీయమని వెల్లడించాడు. తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోఫీ లేనంత మాత్రాన గొప్ప నాయకుడు కాకుండా పోడని అన్నాడు.

* హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. జీవో 99పై స్టే విధించాలని.. కూల్చివేతలను తక్షణమే ఆపేయాలని కేఏ పాల్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికప్పుడు కూల్చివేతలు ఆపలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని.. అక్రమ కట్టడాల కూల్చివేతలకు నెలరోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. అనంతరం ప్రతివాదులుగా ఉన్న హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.

* హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ‘టాయిలెట్ సీట్‌ ట్యాక్స్’ (Toilet seat Tax) వివాదాస్పదమైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషనే ఇందుకు కారణం. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో టాయిలెట్ సీట్‌కు రూ.25 చొప్పున పన్ను వసూలుచేయాలని, ఒక ఇంటిలో ఎన్ని టాయిలెట్లు ఉంటే అన్నింటిపైనా పన్ను చెల్లించాల్సిందేనని ఆ ఉత్తర్వుల సారాంశం. ఇది రాజకీయ విమర్శలకు దారితీసింది. సిగ్గుచేటు చర్య అని భాజపా విమర్శలు గుప్పించింది.

* మంగళగిరిలోని తెదేపా కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వైకాపా నేత, గత ప్రభుత్వంలో ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం.. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

* కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని అందులో పేర్కొన్నారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు.

* ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తామని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) అన్నారు. మూసీని సుందరీకరించి ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు.

* తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం కల్తీ అంశంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పందించారు. జగన్‌ హయాంలో లడ్డూలో కల్తీ జరిగిందని నమ్ముతున్నాం అని కేంద్రమంత్రి తెలిపారు.

* దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయీ సంఘంలోని చివరి సీటు కోసం ఎన్నిక జరిపించేందుకు అంత తొందర ఎందుకని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను దిల్లీ కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు.. దీనికి సంబంధించిన ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహణపై కూడా స్టే విధించింది.

* చంద్రునిపైకి ప్రయాణించిన వ్యోమగామి ధరించిన అరుదైన రోలెక్స్‌ గడియారం వేలానికి సిద్ధమైంది. టెక్సాస్‌కు చెందిన దివంగత వ్యోమగామి ఎగ్డార్‌ మిచెల్‌ ధరించిన వాచ్‌ ఈ నెల 24న వేలం వేయనున్నారు. ఇది రూ.3.35 కోట్లకు పైనే పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

* అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకుని గురువారం రాత్రి ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన శ్రేయోభిలాషులు, అభిమానులను ఉద్దేశించి తాజాగా ఆయన పోస్ట్‌ పెట్టారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ‘‘నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి.. ఫోన్‌ చేసి పరామర్శించిన ప్రధాని నరేంద్రమోదీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. తాను త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

* ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ ఆమోదిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఉప వర్గీకరణకు సర్వోన్నత న్యాయస్థానం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. తీర్పును సమీక్షించాలంటూ 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై నేడు విచారణ జరిగింది. ‘‘పిటిషన్లు అన్నింటినీ పరిశీలించాం. తీర్పును సమీక్షించాల్సిన పరిస్థితులు కనిపించలేదు. అందుకే వాటిని కొట్టివేస్తున్నాం’’ అని కోర్టు పేర్కొంది.

* ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ (Youtube) తన షార్ట్స్‌లో (YouTube Shorts) కీలక అప్‌డేట్‌ తీసుకొచ్చింది. ఇకపై కంటెంట్‌ క్రియేటర్లు మూడేసి నిమిషాల నిడివి గల వీడియోలను అప్‌లోడ్‌ చేసుకునే వెసులు బాటును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ 15 నుంచి ఈ మార్పు రానుంది. దీంతో కంటెంట్‌ క్రియేటర్లు తమ కంటెంట్‌తో యూజర్లకు మరింత చేరువ కావడానికి వెసులుబాటు కలగనుంది.

* కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని అందులో పేర్కొన్నారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు.

* వాస్తవాధీన రేఖ వెంబడి చైనా శరవేగంగా మౌలిక వసతులు, నిర్మాణాలు చేపడుతోందని వాయుసేన చీఫ్‌, ఎయిర్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుక్రవారం వెల్లడించారు. భారత్‌ కూడా అదే స్థాయిలో వేగంగా సరిహద్దుల వద్ద సౌకర్యాలను అప్‌గ్రేడ్‌ చేస్తోందన్నారు. దళాల వద్ద దేశీయ తయారీ ఆయుధ వ్యవస్థలు ఉండటం చాలా ముఖ్యమని సింగ్‌ అభిప్రాయపడ్డారు.

* ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) గురించి బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) సంచలన ఆరోపణలు చేశారు. నెతన్యాహు ఓసారి తన వ్యక్తిగత బాత్రూంను ఉపయోగించారని, ఆ తర్వాత అందులో మాటలు వినే పరికరాలను అమర్చి ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. తాను బ్రిటన్ విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఈమేరకు త్వరలో విడుదల కానున్న తన పుస్తకంలో నాటి సమావేశాన్ని పేర్కొన్నారు.

* తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్‌ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్‌ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షిస్తారని తెలిపింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.

* నిత్యం క్షిపణులు, శక్తివంతమైన బాంబు పరీక్షలు, సూసైడ్‌ డ్రోన్‌ వంటివాటితో తన దేశ ఆయుధ సంపత్తిని ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే పాంగ్యాంగ్‌పై దక్షిణ కొరియా, దాని మిత్రపక్షమైన అమెరికా దాడి చేసేందుకు ప్రయత్నిస్తే.. నిస్సంకోచంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హెచ్చరించారు. ఈ దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ప్రసిద్ధిగాంచిన ఐఐటీ-మద్రాస్‌ (IIT Madras) విద్యార్థులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఎనిమిది వారాల పాటు ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఒక్కో కోర్సుకు రూ.500 నామమాత్రపు రుసుంతో డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)తో పాటు ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ వంటి అధునాతన కోర్సులను బోధించనుంది. ఐఐటీ-మద్రాస్‌కు భాగస్వామిగా నమోదు చేసుకున్న పాఠశాలల్లో 11, 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ సదావకాశం కల్పిస్తోంది. ఆయా స్కూళ్లకు చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సంప్రదించడం ద్వారా ఈ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సుల గురించి 10 కీలక పాయింట్లు ఇవే. ఐఐటీ మద్రాస్‌లో ఇప్పటివరకు 450 పాఠశాలలలు భాగస్వాములుగా చేరగా.. 11వేల మందికి పైగా విద్యార్థులు పలు బ్యాచ్‌లలో వివిధ కోర్సులు నేర్చుకొని లబ్దిపొందారని ఐఐటీ మద్రాస్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. భవిష్యత్తు తరాలను నిపుణులుగా తీర్చిదిద్దడం తమ బాధ్యత అని, విద్యార్థులు తమ అభిరుచులకు నప్పే కెరీర్‌ మార్గాన్ని ఎంచుకొనేందుకు ముందుగానే అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. IIT Madras భాగస్వామ్య పాఠశాలలకు చెందిన విద్యార్థులకు అక్టోబర్‌ నుంచి సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లు మొదలవుతాయి. ఇందుకోసం సెప్టెంబర్‌ 16 నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ.. అక్టోబర్‌ 4తో ముగియనుండగా.. ఆ గడువును అక్టోబర్‌ 10వరకు పొడిగించింది. భాగస్వామిగా చేరాలనుకొనేందుకు అక్టోబర్‌ 5వరకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌ కోర్సుకు బ్యాచ్‌లు అక్టోబర్‌ 21 నుంచి మొదలవుతాయని ఐఐటీ మద్రాస్‌ స్పష్టం చేసింది. డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులకు ఏ స్ట్రీమ్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌ కోర్సుకు మాత్రం మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ అభ్యసిస్తున్నవారే అర్హులు. కోర్సులో భాగంగా.. 30 నిమిషాల నిడివితో రికార్డ్ చేసిన లెక్చర్ వీడియోలు ప్రతి సోమవారం విడుదల చేస్తారు. విద్యార్థులు వారంలో ఎప్పుడైనా వీక్షించే వీలు ఉంటుంది. నెలకు ఒకసారి శని/ఆదివారాల్లో లైవ్‌ ఇంటరాక్షన్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌ అసైన్‌మెంట్‌ రెండువారాలకు ఒకటి చొప్పున మొత్తం నాలుగు అసైన్‌ మెంట్‌లు ఉంటాయి. వీటిని సమర్పించేందుకు రెండు వారాల గడువు ఇస్తారు. నిర్దేశిత గడువు లోగా విద్యార్థులు కంటెంట్‌ వీడియోలను చూడటంతో పాటు తమ అసైన్‌మెంట్‌లను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో అసైన్‌మెంట్‌కు కనీసం 40శాతం మార్కులు తప్పనిసరిగా స్కోరు చేయాలి. తుది మూల్యాంకనం కోసం మొత్తం 4 అసైన్‌మెంట్‌లలో మూడింట్లో అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. ఎనిమిది వారాల ఆన్‌లైన్‌ కోర్సు పూర్తయిన తర్వాత పాసైన విద్యార్థులకు ఈ-సర్టిఫికెట్‌లను పంపిస్తారు. మేరకు అక్కడి ప్రభుత్వ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z