ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అమెరికా తిరుపతిగా పేరుగాంచిన పిట్స్‌బర్గ్‌లో తన నూతన విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ వెబ్ సెక్రటరీ రవి కిరణ్ తుమ్మల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, మార్కెటింగ్ ఉపాధ్యక్షులు భానుప్రకాశ్ ధూళిపాళ్ళ, నార్త్ ఈస్ట్ జోనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ జాతీయ మెంబర్ షిప్ అధ్యక్షులు రామకృష్ణ బాలినేని, నాట్స్ జాతీయ మార్కెటింగ్ సమన్వయకర్త కిరణ్ మందాడి, నాట్స్ షికాగో చాప్టర్ సమన్వయకర్త వీర తక్కెళ్ళపాటి, టంపాబే చాప్టర్ సమన్వయకర్త భార్గవ, షికాగో చాప్టర్ కమ్యూనిటీ సర్వీసెస్ అధ్యక్షులు అంజయ్య వేలూరులు హాజరయ్యారు. వీణ జూలూరు గణపతి స్తోత్రంతో కార్యక్రమం ప్రారంభమైంది. అర్చన కొండపి స్వాగతం పలికారు. నాట్స్ సంస్ధ 200 మంది సభ్యులతో మొదలై ఎదిగిన వైనాన్ని వీడియో రూపంలో ప్రదర్శించారు.
నాట్స్ తెలుగువారికి ఎలాంటి సేవలు అందిస్తుంది..? 2009 నుంచి ఇప్పటివరకు చేసిన సేవా కార్యక్రమాలను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి వివరించారు. అమెరికాలో తెలుగువారు నాట్స్‌లో సభ్యులు కావాల్సిన అవశ్యకతను ఇతర ప్రతినిధులు వివరించారు. నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, పిట్స్‌బర్గ్ నాట్స్ సమన్వయకర్తగా రవి కొండపి, ఉప సమన్వయకర్తగా శిల్ప బోయిన, పిట్స్‌బర్గ్ నాట్స్ కార్యదర్శిగా రామాంజనేయులు గొల్ల, కోశాధికారిగా శ్రీహర్ష కలగర, క్రీడల సమన్వయకర్తగా మనోజ్ తాతా, క్రీడల ఉప సమన్వయకర్తగా గిరీష్, పిట్స్‌బర్గ్ నాట్స్ యువజన సమన్వయకర్తగా నేహాంత్ దిరిశాల, ఉప సమన్వయకర్తగా రానా పరచూరి పిట్స్‌బర్గ్ నాట్స్ మహిళా, సాంస్కృతిక సమన్వయకర్తగా ప్రియ భవినేనిలను నియమించారు. పిట్స్‌బర్గ్ చాప్టర్ సలహాబృంద సభ్యులుగా హేమంత్ కె.ఎస్., అర్చన కొండపి, సాయి అక్కినేని, వెంకట్ దిరిశాల (బాబా వెంకట్), లీల అరిమిల్లిలను ప్రకటించారు. హేమంత్ రాయులు, హరీష్ గంటా, మనోజ్ కొమ్మినేని, సూరి రచ్చా, శ్రావణ్ గుండేల, ప్రశాంత్ నంద్యాల,లక్ష్మి మహాలి, మురళి మేడిచెర్ల, కిషోర్ నారె, శ్వేత గుమ్మడి, శర్వాణి, సంకీర్త్ కటకంలకు నాట్స్ పిట్స్‌బర్గ్ విభాగం సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z