NRI-NRT

డెట్రాయిట్‌లో GTA బతుకమ్మ-దసరా వేడుకలు

డెట్రాయిట్‌లో GTA బతుకమ్మ-దసరా వేడుకలు

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ-దసరా వేడుకలు ఫార్మింగ్టన్ హిల్స్‌లోని (Detroit) ‘ది స్టూడియోలో’ ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ ఉత్సవం తెలంగాణ సంస్కృతి, పద్ధతులు ఆచారాలకు ప్రతిబింబంలా నిలిచింది. ఈ సందర్భంగా అందమైన బతుకమ్మను రూపొందించిన మహిళలకు నిర్వాహకులు పలు బహుమతులను అందించారు. వివిధ సంఘాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో హాజరు కావటం నిర్వాహకులకు మరింత స్ఫూర్తినిచ్చింది. జీటీఏ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి ఆధ్వర్యంలో డెట్రాయిట్ సిటీ చాప్టర్ బృందం అధ్యక్షుడు కమల్ పిన్నమరెడ్డి, ప్రెసిడెంట్-ఎలెక్ట్ వెంకట్ వడ్నాల, స్వప్న చింతపల్లి, సుష్మా పడుకోన్, సుమ కలువల, దీప్తి చిత్రపులతో కూడిన జీటీఏ-వనిత బృందం ఈ కార్యక్రమాన్ని నెలరోజుల పాటు ప్రణాళిక రచించి విజయవంతం చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z