NRI-NRT

బ్రిటన్‌లో వినూత్నంగా దసరా వేడుకలు

బ్రిటన్‌లో వినూత్నంగా దసరా వేడుకలు

బ్రిటన్ లోని బ్రాక్నెల్ నగర తెలుగు సంఘం “బ్రాక్నెల్ గ్యాంగ్” ఆధ్వర్యంలో స్థానిక బ్రేబ్రూక్ సభా మందిరంలో దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలు ఆట, పాటలతో, విందు భోజనాలతో ఉల్లాసంగా సాగాయి. సభా నిర్వాహకులు దసరా ప్రాముఖ్యాన్ని స్కిట్ రూపంలో సరళంగా వివరించారు. పాత జ్ఞాపకాల శీర్షికన సాగిన ఈ సంబరాలలో ప్రవాసులు ప్రదర్శించిన అలనాటి దూరదర్శన్ ప్రకటన, లఘు స్కిట్లు నవ్వులలో అలరించాయి. చిన్నారులు నాట్య ప్రదర్శన చేశారు. “హుక్ స్టెప్స్ ఛాలెంజ్”లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z