2020 నుండి 2022 మధ్య మైనర్ బాలిక(15)ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై వర్జీనియాకు చెందిన ప్రవాసాంధ్రుడు ఫణి తాళ్లూరు(52) జైలు పాలయ్యాడు. అక్టోబర్ 8న యాష్బర్న్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
2020 మొదలుకుని, అప్పట్లో 11ఏళ్ల వయస్సు కలిగిన తన కుమార్తె స్నేహితురాలైన సదరు బాలికకు ఆన్లైన్లో అసభ్య చిత్రాలు పంపడమే గాక, ఇతర చర్యల ద్వారా బాలికకు 13ఏళ్లు వచ్చిన 2022 వరకు వేధింపులకు గురి చేసినట్లు ఫణిపై నవంబరు 2022లోనే అభియోగాలు నమోదు చేశారు. అమెరికా చట్టాల ప్రకారం న్యాయవ్యవస్థ బయట రాజీ కుదిరినప్పటికీ, మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడితే రాజీలతో ప్రమేయం లేకుండా సదరు నిందితులపై చట్ట ప్రకారం కోర్టుల ద్వారా విచారణ చేపట్టి శిక్ష విధిస్తారు. సమాచారం అందుకున్న ఫణి తానే లొంగిపోయాడు. నవంబరు 2022లో నమోదైన ఫిర్యాదుపై, అక్టోబర్ 7వ తేదీన ఫణి లొంగిపోయాడు. ఈ కేసు విచారణ డిసెంబరు 2వ తేదీన నిర్వహించి తదుపరి తీర్పు వెలువరిస్తారు.
https://law.lis.virginia.gov/vacode/18.2-67.2/
https://law.lis.virginia.gov/vacode/18.2-374.3/
https://law.lis.virginia.gov/vacode/18.2-67.3/
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z