DailyDose

Horoscope in Telugu – Oct 19 202

Horoscope in Telugu – Oct 19 202

మేషం
ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది

వృషభం
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. శివారాధన శుభకరం.

మిథునం
శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి.శ్రీలక్ష్మీదేవి సందర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం
మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. శ్రీలక్ష్మీ సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

సింహం
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాయిబాబా సచ్చరిత్ర చదివితే బాగుంటుంది.

కన్య
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శక్తిని ఇస్తుంది.

తుల
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. ఇష్టదేవత సందర్శనం ఉత్తమం.

వృశ్చికం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

ధనుస్సు
ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని ఇస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

మకరం
దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

కుంభం
మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది..

మీనం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z