NRI-NRT

24వ తానా మహాసభలకు…$3 మిలియన్‌ డాలర్ల హామీలు!

24వ తానా మహాసభలకు… మిలియన్‌ డాలర్ల హామీలు!

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) డెట్రాయిట్‌లో 2025 జులై 3 నుండి 5వ తేదీ వరకు నిర్వహించనున్న 24వ తానా ద్వైవార్షిక మహాసభల నిధుల సేకరణ, సన్నాహక సమావేశాన్ని శనివారం నాడు స్థానిక సెయింట్ తోమా చర్చిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసుల నుండి మహాసభల నిర్వహణకు $3మిలియన్ డాలర్లకు హామీలు లభించినట్లు సభల సమన్వయకర్త చాపలమడుగు ఉదయకుమార్ తెలిపారు. డెట్రాయిట్ పరిసర ప్రాంతమైన నోవీలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో సభల ఛైర్మన్ నాదెళ్ల గంగాధర్, సహాయ సమన్వయకర్త శ్రీనివాస్‌ కోనేరు, డైరెక్టర్‌ సునీల్‌ పాంట్ర, సెక్రటరీ కిరణ్‌ దుగ్గిరాల, ట్రెజరర్‌ జోగేశ్వరరావు పెద్దిబోయిన, తానా నార్త్‌ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ నీలిమ మన్నె, కార్యనిర్వాహక అధ్యక్షుడు డా. నరేన్‌ కొడాలి, కార్యదర్శి రాజా కసుకుర్తి, ట్రెజరర్‌ భరత్‌ మద్దినేని, బోర్డ్‌ చైర్మన్‌ డా. నాగేంద్ర శ్రీనివాస్‌ కొడాలి, సెక్రటరీ లక్ష్మీ దేవినేని, ట్రెజరర్‌ జనార్ధన్‌ నిమ్మలపూడి, రవి పొట్లూరి, లావు శ్రీనివాస్‌, ఫౌండేషన్‌ ట్రెజరర్‌ వినయ్‌ మద్దినేని, పరమేష్ దేవినేని, కొమ్మన సతీష్, మల్లి వేమన, సూరపనేని రాజా, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, తానా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చలసాని మల్లిఖార్జునరావు, కొడాలి చక్రధరరావుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి సేవలను కొనియాడారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z