మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు రెండు మూడు ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహా రాలు కొంత వరకూ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కొంత ప్రశాంత, ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కుటుంబంలో కొద్దిగా సమస్యలు తప్పకపోవచ్చు. ఇరుగు పొరుగుతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగం మారడానికి ప్రస్తుతానికి సమయం అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాలపరంగా దూసుకు వెడతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో కొద్దిగా కలతలు రేగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ధన నష్టం జరిగే సూచనలున్నాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో బాధ్యతలు మారడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు బాగా పెరు గుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. బంధువర్గం ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో పని ఒత్తిడి, శ్రమ కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు పర వాలేదనిపిస్తాయి. కొద్దిపాటి వ్యయప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. దైవ కార్యాల మీద ఖర్చు పెరుగుతుంది. ఒకరిద్దరికి సహాయం చేయాల్సి వస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో ఆర్థిక సమస్యలు సర్దుమణుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నాచితకా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. దైవ కార్యాల మీద కూడా ఖర్చు పెరుగుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఆరోగ్యం పరవా లేదు. ధనపరంగా ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వృత్తి జీవితం సంతృప్తికరంగానే సాగిపో తుంది. వ్యాపారాలు సాదా సీదాగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గిపోవడానికి అవ కాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఒక శుభవార్త వినడం జరుగుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కూడా ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సమాధానం అందుతుంది. విద్యా విషయాల్లో పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. కొందరు సన్నిహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగిపో తాయి. ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఇతరులకు సహా యం చేసే స్థితిలో ఉంటారు. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో కొద్దిగా అనుకూలతలు కనిపిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిం చడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవ హారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వినడం జరుగు తుంది. ఇంటా బయటా మీ సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదని స్తుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z