ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతిబింబించేలా తొలిసారిగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అట్టతద్దె పండుగను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. ముగ్గులు, ఆటల పోటీలు, భరతనాట్యం, కూచిపూడి, కోలాటం తదితర సాంస్కృతిక పోటీలతో సందడి చేశారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. భక్తిశ్రద్ధలతో ఉమాగౌరీ వ్రతం చేసి వేడుకగా ఈ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిసుధ పాలడుగు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాలక్రమేణ అట్లతద్దె కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి పండుగలు, వేడుకల ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అమెరికాలో ఉన్న పిల్లలు, మహిళలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
సుధ కొండపు, నవ్య ఆలపాటి, సుష్మ అమృతలూరి, అనిత మన్నవ, తనూజ యలమంచిలి, శ్రీదివ్య సోమ, గీత చిలకపాటి, ఇందు చలసాని, శిరీష నర్రా, అపర్ణ ఆలపాటి, శ్వేత కావూరి, శాంతి పారుపల్లి, ఫణి గాయత్రి, సరిత ముల్పూరి, మల్లి నన్నపనేని తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z