NRI-NRT

రొమ్ము క్యాన్సర్‌పై నాట్స్ అవగాహన సదస్సు

రొమ్ము క్యాన్సర్‌పై నాట్స్ అవగాహన సదస్సు

ఉత్తర అమెరికా తెలుగు సొసైటె (నాట్స్) న్యూజెర్సీలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. అక్టోబర్ నెలను రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా భావిస్తారు. ఈ క్రమంలో నాట్స్ ఈ సదస్సును ఏర్పాటు చేసింది.

నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ బోర్డు మాజీ అధ్యక్షురాలు అరుణ గంటిలు సారథ్యం వహించారు. న్యూజెర్సీకి చెందిన స్థానిక తెలుగు వైద్యులు బ్యూలా విజయ కోడూరి, చరిష్మా భీమినేనిలు విలువైన సూచనలు చేశారు. 40 ఏళ్ళ వయసు దాటిన స్త్రీలకు మామోగ్రామ్ పరీక్ష అవశ్యకతను వివరించారు. క్యాన్సర్‌పై మహిళల సందేహాలను నివృత్తి చేశారు.

నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, న్యూజెర్సీ ఉమెన్ యెంపవర్మెంట్ టీమ్ శ్రీదేవి జాగర్లమూడి , ప్రణీత పగిడిమర్రి, ప్రసూన మద్దాలి, శ్రీదేవి పులిపాక, ఇందిరా శ్రీరామ్, స్వర్ణ గడియారం, గాయత్రి చిట్టేటి, న్యూజెర్సీ నాట్స్ నాయకులు రాజ్ అల్లాడ, మురళీకృష్ణ మేడిచెర్ల, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, ప్రసాద్ టేకి, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, కృష్ణసాగర్ రాపర్ల, హరీష్ కొమ్మాలపాటి, రామకృష్ణ బోను తదితరులు పాల్గొన్నారు. నాట్స్ న్యూజెర్సీ విభాగాన్ని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z