NRI-NRT

శనివారం నాడు నాట్స్ సంబరాల సన్నాహక సమావేశం

శనివారం నాడు నాట్స్ సంబరాల సన్నాహక సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 8వ ద్వైవార్షిక “అమెరికా తెలుగు సంబరాలు” వచ్చే ఏడాది జులై నెలలో నిర్వహిస్తున్నారు. ఈ సభల సన్నాహక సమావేశాన్ని శనివారం నాడు ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలోని ఇండియన్ కల్చరల్ సెంటరులో నిర్వహిస్తున్నామని సభల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు పాములపాటి మదన్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. సంగీత దర్శకుడు తమన్ ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలకు దిగువ బ్రోచరును చూడవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z