పోలీసు నేపథ్య సినిమాల్లో ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ ఓ ట్రెండ్ సెట్టర్. బాలకృష్ణను పోలీసు దుస్తుల్లో చూసి అభిమానులు మురిసిపోతే… ఖాకీ డ్రెస్సులో బాలయ్య పెర్‌ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు అదుర్స్ అన్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా హోం వర్క్ చేశారు. పోలీసులు ఎలా నడుస్తారు.. ఎలా లాఠీ పట్టుకుంటారు… జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. రోజూ సినిమాలో వాడిన జీపులో చిత్రీకరణకు వచ్చేవారట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు బి.గోపాల్ ఓ సందర్భంలో చెప్పారు. “ఓ రోజు ఉదయం బాలయ్య బాబు ఫోన్ చేసి ఈ రోజు నేను చిత్రీకరణకు రావడం లేదు అన్నారు. ఏమైంది బాబూ అనడిగితే.. సినిమా నేను వాడుతున్న జీపు పంపిస్తే అందులోనే షూటింగ్‌కి వస్తా.. అప్పుడు ఆ పాత్రలో లీనమవ్వగలను అని చెప్పారు. మేం అలానే జీపు పంపించాం. ఎప్పుడూ ఏసీ కారులో వచ్చే బాలయ్య బాబు ఆ రోజు పోలీసు జీపులో పోలీసుల్లా కాలు బయట పెట్టి.. లాఠీ తిప్పుతూ వచ్చారు. సినిమా అంటే అంత ప్యాషన్ ఆయనకి. సినిమా చిత్రీకరణ జరిగినన్ని రోజులూ అలానే వచ్చారు” అని బీ.గోపాల్ తెలిపారు.
జీపు కావాలని కోరిన బాలయ్య
Related tags :