నెబ్రాస్కా గవర్నర్ Jim Pillen & Suzanne Pillen నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో డాక్టర్ ఫణి తేజ్ ఆదిదం, సుందర్ చొక్కర (నెబ్రాస్కా హిందూ దేవాలయం అధ్యక్షుడు), కొల్లి ప్రసాద్, నవీన్ కంటెం, మల్లికా మద్దూరి జయంతి, దిలీప్ దోనేపూడి, తాతారావు కోసూరి, రాజా కోమటిరెడ్డి, అరుణ్ పాండిచ్చేరి, వందనా సింగ్, ముకుంద్ క్యామ్టీ, సుధా శివమణి, ప్రశాంత్ పనిక్కస్సేరిల్, కీర్తి రంజిత్, తపన్ దాస్, శైలేష్ ఖోస్, ఇషాని అడిదమ్, శరత్ చంద్ర దొంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ మాట్లాడుతూ హిందూ సంప్రదాయాల పట్ల, భారతదేశంలోని వైవిధ్యం పట్ల తన మక్కువను చాటుకున్నారు. వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. అనంతరం అతిథులకు విందు ఏర్పాటు చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z