ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) 8వ ద్వైవార్షిక సంబరాలు ఫ్లోరిడాలోని టంపా కన్వెన్షన్ సెంటరులో 2025 జులై 4,5,6 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ సభల నిర్వహణ వేదికను శనివారం నాడు నాట్స్ ప్రతినిధులు సందర్శించారు. 6లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటరులో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా అమెరికా తెలుగు సంబరాలు నిర్వహిస్తామని సభల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు. ప్రవాస తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొని సంబరాలను దిగ్విజయం చేయాలని కోరారు. టాంపాలో శనివారం నాడు 8వ నాట్స్ సంబరాల సన్నాహక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. 2.5మిలియన్ డాలర్లు (₹25కోట్లకు) విరాళాలు ఇచ్చేందుకు ప్రవాసులు ముందుకు వచ్చినట్లు సంబరాల సమన్వయకర్త గుత్తికొండ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక డ్యాన్స్ స్కూల్స్ సబ్రిన (గణేశస్తోత్రం, కౌత్వం), సరయు, లీలా టాలీవుడ్ లేడీస్ డాన్స్, మాధురి (తిల్లానా), శివం గర్ల్స్, సరయు(తమన్ మెడ్లీ), సబ్రిన(అన్నమయ్య కీర్తన),శివం(మస్తీ) తదితరుల నాట్య ప్రదర్శన, సాకేత్ కొమాండూరి, మనీషా ఈరబత్తిని, శృతి రంజనీల సంగీత విభావరి, సాహిత్య వింజమూరి వ్యాఖ్యానం అలరించాయి. సంబరాల ట్రైలర్ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమన్ రిలీజ్ చేశారు.
శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, భాను ధూళిపాళ్ల, రాజేష్ కాండ్రు, జగదీష్ చాపరాల, మాలినీ రెడ్డి, అచ్చిరెడ్డి, ప్రసాద్ ఆరికట్ల, విజయ్ కట్టా, సుధాకర్ మున్నంగి, బిందు బండా, సుమంత్ రామినేని, సురేష్ బుజ్జా, శ్రీనివాస్ బైరెడ్డి, మాధురి గుడ్ల, రవి కానూరి, ప్రసాద్ కొసరాజు, భరత్ ముద్దన, సతీష్ పాలకుర్తి, రవి కలిదిండి, కృష్ణ భగవరెడ్డి, శ్యామ్ తంగిరాల, మాలినీ రెడ్డి తంగిరాల, మధు తాతినేని, మాధవి యార్లగడ్డ, రామ కామిశెట్టి, అనిల్ అరమండ, భాస్కర్ సోమంచి, శివ తాళ్లూరి, ప్రసన్న కోట, ప్రహ్లాదుడు మధుసూదుని, శిరీషా దొడ్డపనేని, రవి కానూరు, కిరణ్ పొన్నం, వీర జంపాని, సుధీర్(నాని) తదితరులు సభల నిర్వాహక బృందంలో ఉన్నారు.
శనివారం నాడు టంపాలో నిర్వహించిన నాట్స్ బోర్డు సమావేశంలో నిధుల సేకరణ, కార్యక్రమాల నిర్వహణ, స్థానిక తెలుగు సంస్థల సహకారం వంటి అంశాలపై చర్చించారు. నాట్స్ కొత్త చాప్టర్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాట్స్ సభ్యత్వాన్ని పెంపొందించే చర్యలపై కార్యాచరణను రూపొందించారు. నాట్స్ జీవిత కాల సభ్యత్వాన్ని ప్రోత్సహించేలా నాయకులు కృషి చేయాలని బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. కొత్త చాప్టర్లు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. బోర్డు సమావేశంలో నాట్స్ బోర్డ్ మాజీ చైర్ పర్సన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు గంగాధర్ దేసు, మోహనకృష్ణ మన్నవ, బాపు నూతి, శ్రీనివాస్ మంచికలపూడి, రాజేంద్ర మాదల, నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీహరి మందాడి తదితరులు పాల్గొన్నారు. టీఏఎఫ్, మాటా, టీజీఎల్ఎఫ్, టీటీఏ, ఎఫ్ఐఏ, హెచ్టీఎఫ్ఎల్, సస్త, ఐటీ సర్వ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
More Details About NATS 8th America Telugu Sambaralu – https://www.sambaralu.org/
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z