గత 20ఏళ్లుగా ప్రతి ఏటా జనవరి 18వ తేదీన ఎన్.టి.ఆర్, హరివంశరాయ్ బచ్చన్ వర్ధంతి సందర్భంగా లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని వ్యవస్థాపకులు, రాజ్యసభ మాజీ సభ్యులు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నేడు విశాఖలో 2024 లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కార గ్రహీతల వివరాలను వెల్లడించారు. లోకకవి అందెశ్రీకి సాహిత్య పురస్కారాన్ని, ₹2లక్షల నగదు బహుమతి అందజేస్తున్నట్లు తెలిపారు.
* లోక్‌నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కార గ్రహీతలు (ఒక్కొక్కరికి ₹2లక్షలు)
1. అందెశ్రీ
2. ఖాదర్ మొహియుద్దీన్
* లోక్‌నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం (ఒక్కొక్కరికి ₹1లక్ష)
1. డా. హరనాథ్ పోలిచెర్ల.
* లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారం (ఒక్కొక్కరికి ₹1లక్ష)
1. డా. బీ.ఆర్.కె.ప్రసాద్ (స్వచ్ఛ చల్లపల్లి)
2. ఇమ్మణ్ని దీపా వెంకట్ (స్వర్ణభారతి ట్రస్టు)
త్రిపుర గవర్నర్ నల్లు. ఇంద్రసేన రెడ్డి, నిర్మాత చలసాని అశ్వనీదత్తు, నటుడు బ్రహ్మానందం, దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి, బోస్టన్‌కు చెందిన గుడివాడ ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వల్లేపల్లి శశికంత్ లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. 2025 జనవరి 18వ తేదీ విశాఖలో సాయంకాలం 5గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Ande Sri
Dr. Haranath Policherla
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z