DailyDose

Horoscope in Telugu – Nov 14 2024

Horoscope in Telugu – Nov 14 2024

మేషం
మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన చేస్తే మంచిది.

వృషభం
మనోబలంతో పనులను పూర్తిచేస్తారు. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

మిథునం
శుభకాలం. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్దిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

కర్కాటకం
ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. రుణసమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన శుభకరం.

సింహం
ప్రారంభించబోయే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

కన్య
మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక విషయంలో మనఃసంతోషాన్ని పొందుతారు. గిట్టనివారితో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

తుల
మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

వృశ్చికం
బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచనాధోరణి, ముందుచూపునకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. శ్రీలలితా సహస్రనామ పారాయణ చేయాలి.

ధనుస్సు
చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మకరం
దైవబలం అనుకూలిస్తోంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు విశేషమైన లాభాన్ని చేకూరుస్తాయి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

కుంభం
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. గణపతి స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.

మీనం
శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z