* గంజాయి స్మగ్లర్లు బరి తెగించారు. ఏకంగా అటవీశాఖకు చెందిన భూమిలోనే గంజాయి సాగు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం మనబంగి పంచాయతీ జడిగూడలో 15 ఎకరాల అటవీ భూమిలో గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ సూచనలతో రెవెన్యూ, అటవీశాఖ, పోలీసుల సమన్వయంతో ధ్వంసం చేసి తగులబెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి రవాణా, సాగుపై ఇటీవల పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం ఇచ్చే సాయంతో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ మాజీ ఎంపీ, సినీనటి నవనీత్ రాణా (Navneet Rana) ప్రచార సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరావతి జిల్లాలోని ఖల్లార్ గ్రామంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఆమె సభలో అభ్యంతరకరంగా వ్యవహరించడంతో హింసకు దారితీసింది. ఈ ఘటనలో పోలీసులు 45మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై నవనీత్ రాణా తీవ్రస్థాయిలో స్పందిస్తూ.. బెదిరింపులను మౌనంగా భరించే రోజులు పోయాయన్నారు.
* ఈశాన్య రాష్ట్రం మణిపుర్ (Manipur)లో మళ్లీ హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల సీఆర్పీఎఫ్ ఎన్కౌంటర్లో 10 మంది మృతి చెందడం, ఈ క్రమంలోనే మైతెయ్ తెగకు చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తాజా ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఈ పరిణామాల నడుమ మణిపుర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని దిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
* ప్రణవ్.. (Pranav Mohanlal) మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కొడుకు. అతగాడు నటుడు, ప్లేబ్యాక్ సింగర్, పాటల రచయిత కూడా. ప్రస్తుతం తను ‘వర్క్ అవే’ ప్రోగ్రాంలో భాగంగా స్పెయిన్‌లోని ఓ ఫామ్‌లో ఉన్నాడట. అక్కడే పని చేసుకుంటూ.. ఇంకా చెప్పాలంటే గొర్రెలు, గుర్రాలు, మేకలు కాసుకుంటూ.. వారు పెట్టేది తింటూ అందులోనే నిద్రపోతున్నాడట. ఈ వివరాలన్నీ అతడి తల్లి సుచిత్ర (Suchitra Mohanlal) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ప్రపంచానికి తెలిసింది.
* మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కోలాహలం నెలకొంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులంతా ప్రచారంలో తలమునకలయ్యారు. ఈ క్రమంలోనే పరాందా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థి.. ఎన్నికల అధికారికి చేసిన విజ్ఞప్తి చర్చనీయాంశమైంది. తన ఎన్నికల గుర్తు ‘చెప్పులు’ అని.. పోలింగ్ కేంద్రాల వద్ద వాటిని ధరించడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంటూ వాటిని నిషేధించాలని కోరడం గమనార్హం.
* తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరి (Actress Kasturi)ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారించిన ఎగ్మోర్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం 12 రోజుల పాటు ఆమెకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను పుళల్ కేంద్ర కారాగారానికి తరలించారు. ఇదిలా ఉండగా, తీర్పు అనంతరం బయటకు వచ్చిన కస్తూరి అక్కడే ఉన్న విలేకర్లను చూసి.. ‘‘అధికార దుర్వినియోగానికి ముగింపు పలకండి. న్యాయాన్ని గెలిపించండి’’ అని వ్యాఖ్యలు చేశారు.
* వైకాపా నేత, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడి(Kavati Manohar Naidu)పై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేత కనపర్తి శ్రీనివాసరావు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
* తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ.లక్ష మిగులుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి కొత్త ఈవీ పాలసీ వస్తుందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవీ పాలసీ వివరాలను మంత్రి వెల్లడించారు.
* భవిష్యత్ తరాల కోసమే మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని కోరారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమది బుల్డోజర్ ప్రభుత్వం కాదని.. ఆ తరహా ప్రభుత్వం యూపీలో ఉందని అన్నారు. మోదీ ఆదేశిస్తే.. యోగీ పాటిస్తారని వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ తప్పు బహిర్గతమైందన్నారు.
* భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నటనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శించారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ (KTR) అమాయకంగా నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్‌లో అరెస్టులు చేస్తామన్నారని చెప్పారు. భారాస నేతలు కాంగ్రెస్ హైకమాండ్‌ను కలవగానే కాళేశ్వరం కుంభకోణం ఎటు పోయిందో అని ఎద్దేవా చేశారు.
* గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report)పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ప్రశంసల వర్షం కురిపించారు. నిజాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ‘‘కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాని ఉద్దేశించి ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్‌పై ప్రధాని ఈ విధంగా స్పందించారు.
* ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై ఆదివారం(నవంబర్ 17) రష్యా భారీ దాడులు చేసింది. శీతాకాలం వస్తుండడంతో ఉక్రెయిన్‌కు కీలకమైన పవర్ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌పై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో కీవ్ సహా పలు జిల్లాలు,నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశ విద్యుత్తు సరఫరా,ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ వెల్లడించారు. మరోవైపు రాజధాని కీవ్‌లో భారీగా పేలుళ్లు జరిగాయి. ఇక్కడి సిటీ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని పోలండ్ పూర్తిగా అప్రమత్తమైంది. రష్యా, ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది.
* వాహనదారుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఏకంగా రూ.2.5లక్షల జరిమానా విధించడంతో పాటు సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ని సైతం రద్దు చేశారు. అంబులెన్స్‌కు ఉన్న పేషెంట్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. వాహనం యజమాని దారి ఇవ్వకపోవడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సాధారణంగా వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఎవరైనా హారన్ ఇచ్చిన సందర్భంలో దారి ఇస్తుంటారు. ముఖ్యంగా అంబులెన్స్‌లు వచ్చిన సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా దారి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా డ్రైవర్ని ఇబ్బందులకు గురి చేశాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఎదురుగా వెళ్తున్న కారును దాటి అంబులెన్స్ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఏమాత్రం సైడ్ ఇవ్వలేదు. అంబులెన్స్ సైరన్ మోగుతున్నా.. వాహనం హారన్ ఇస్తున్నా కారు యజమాని ఏదేమీ పట్టించుకోలేదు. అయితే, అంబులెన్స్‌లోనే ఉన్న మరో వ్యక్తి కారు యజమాని ప్రవర్తనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ క్రమంలో కేరళ పోలీసులు స్పందించారు. సదరు కారు యజమాని ఇంటికి వెళ్లి రూ.2.5లక్షల జరిమానా విధించారు. అంతటితో ఆగకుండా డ్రైవింగ్ లైసెన్స్‌ని సైతం రద్దు చేసినట్లు తెలుస్తున్నది. కారు యజమాని తీరుపై పలువురు యూజర్లు విమర్శలు గుప్పించారు. రోడ్డు భద్రతా నియమాలు, చట్టాల్లో భాగంగా అంబులెన్స్‌లకు దారి ఇవ్వడం ఓ ముఖ్యమైన అంశమని, దానికి దారి ఇవ్వని వారు శిక్షార్హులని నిర్ధారించగలరా? అంటూ ఓ యూజర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ట్యాగ్ చేశారు. కారు యజమాని ప్రవర్తన సిగ్గుచేటని ఒకరు.. కొందరిలో కనీస స్పృహ లేకుండాపోతుందని మరో యూజర్ పేర్కొన్నారు.
* కార్తీక మాసం నేపథ్యంలో ఇంటికి చికెన్ తెచ్చిన తమ్ముడిపై అన్నలు ఆగ్రహించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో తాడుతో గొంతునొక్కి అతడ్ని హత్య చేశారు. (Man Killed For Bringing Chicken) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 9న బైరాగఢ్ ప్రాంతంలోని ఇందిరా నగర్లో నివసించే ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నాదమ్ములు మద్యం సేవించారు. మందు పార్టీలో చికెన్ కావాలని తమ్ముడైన 22 ఏళ్ల అన్షుల్ యాదవ్ పట్టుబట్టాడు. అయితే కార్తీక మాసం కావడంతో అన్నలు కుల్దీప్, అమన్ వద్దని చెప్పారు. కాగా, బయటకు వెళ్లిన అన్షుల్ కోడి మాంసం కొని ఇంటికి తీసుకువచ్చాడు. ఇది చూసి అన్నలైన కుల్దీప్, అమన్ ఆగ్రహం చెందారు. ఈ అంశంపై వారి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా తాడుతో గొంతు నొక్కి తమ్మడు అన్షుల్‌ను హత్య చేశారు. ఆ తర్వాత తల్లితో కలిసి అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంటికి తిరిగి రాగానే స్పృహతప్పి పడిపోయాడని చెప్పారు. అయితే అన్షుల్ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
* ఇదిలావుంటే కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతుందని.. అదికూడా ప్రేమ పెళ్లి కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలుస్తుంది. పెళ్లి కొడుకు కూడా సురేష్ ఫ్యామిలీకి చాలా దగ్గరి బంధువని.. అందుకే కీర్తి ఒకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ రెండోవారంలో గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి జరగబోతున్నట్లు టాక్. కాగా దీనిపై కీర్తి సురేష్ క్లారిటీ ఇవ్వవలసి ఉంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z