సికింద్రాబాద్ ఓల్డ్‌బోయిన్‌పల్లిలో కల్తీ అల్లంపేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ బృందం జరిపిన దాడుల్లో 1500 కిలోల కల్తీ అల్లంపేస్ట్ స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్ట్ చేసినట్టు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వై.వి.ఎస్.సుధీంద్ర ఆదివారం తెలిపారు. రాజరాజేశ్వరి నగర్‌లో మహ్మద్ షఖీల్ అహ్మద్ ‘సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్’ పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అల్లంకు బదులు ప్రమాదకరమైన సిట్రిక్‌యాసిడ్, ఉప్పు, పసుపు ఉపయోగిస్తూ.. అల్లం లేకుండానే పేస్ట్ తయారు చేస్తున్నారు. నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ విక్రయించడం విశేషం. మూడేళ్లుగా సాగుతున్న కల్తీ దందాపై ఫిర్యాదులు రావటంతో బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సైదులు, తనిఖీలు నిర్వహించారు. కల్తీ అల్లం పేస్ట్ 1500 కిలోలు, సిట్రిక్ యాసిడ్ 55 కిలోలు, 480 కిలోల నాసిరకం వెల్లుల్లి స్వాధీనం చేసుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z