* గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో అరెస్టైనట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. ఇతడి సూచనల మేరకే ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు నిందితులు వెల్లడించిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్‌పై ఆరోపణలు ఉన్నాయి. 2022లో హత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులో అనుమానితుడిగా ఉన్నాడు. అలాగే ఇటీవల ముంబయిలో సంచలనం సృష్టించిన బాబా సిద్దిఖీ హత్య కేసు నిందితులతో ఇతడు టచ్‌లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
* భాగ్యనగరంలోని చెరువులను పరిరక్షించడమే కాకుండా వాటిని కాలుష్యం భారి నుంచి రక్షించేందుకు హైడ్రా (Hydra) చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)తో కలిసి పనిచేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు పీసీబీ కార్యాలయంలో పీసీబీ మెంబర్ సెక్రటరీ జి.రవితో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. నగరంలోని కాలువలు, చెరువుల్లోకి మురుగు నీటితోపాటు పారిశ్రామిక వ్యర్థాలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పారిశ్రామిక వ్యర్థాలు డంప్ చేయకుండా ఇరు విభాగాల సిబ్బందితో గట్టి నిఘా పెట్టాలని నిర్ణయించారు.
* రెండు రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆ ఇంట్లో భారీగా బంగారం, నగదు చోరీకి గురైంది. 1.33 కిలోల బంగారు ఆభరణాలు, 800 గ్రాముల వెండి నగలు, రూ.2.50 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
* మెట్రో రైలు రెండో దశపై సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రో (Hyderabad Metro) మొదటి దశ పనులు చేపట్టిన ఎల్ అండ్ టీకి భారీగా నష్టం వాటిల్లిందని, అందుకే రెండో దశ పనులకు ప్రైవేటు సంస్థలేవీ ముందుకు రావట్లేదని అన్నారు. రెండో దశపై సీఎం రేవంత్‌రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామన్న ఆయన.. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మాణం చేపట్టాలని సూచించినట్లు తెలిపారు.
* గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
* మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election) ప్రచారం ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారులు భారీగా తాయిలాలను సీజ్ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా పలు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు రూ.1082 కోట్ల విలువైన ఎన్నికల తాయిలాలను సీజ్ చేశాయి.
* మండల-మకరవిళక్కు సందర్భంగా శబరిమలలో మరింత మందికి అయ్యప్పస్వామి దర్శనం కల్పించేలా కేరళ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. వర్చువల్ క్యూ బుకింగ్స్ పరిమితిని పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ పద్ధతి ద్వారా 70వేల మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా మరో 10 వేల మంది అయ్యప్పస్వామి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు.
* దేశంలో జనాభా ప్రాతిపదికన అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం కల్పించాలన్నదే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్యేయమని.. ఆ దిశలోనే ఆయన ముందుకు వెళ్తున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారత్ జోడో యాత్ర ఫలితంగా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణలో కులగణన చేపట్టినట్లు వెల్లడించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్ష, చంద్రపూర్, రజురా నియోజకవర్గాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పొన్నం పాల్గొన్నారు.
* నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా, భారత్ (AUS vs IND) మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ప్రారంభంకానుంది. పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూరమయ్యే ఛాన్స్ ఉంది. అతను తన భార్య రెండో కాన్పునకు సమయం దగ్గరపడటంతో ఆసీస్‌కు వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోయాడు. శుక్రవారం రోహిత్ సతీమణి రితికా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని రోహిత్ బీసీసీఐకి తెలియజేశాడట. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ తీసుకున్న నిర్ణయానికి ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ (Travis Head) మద్దతు పలికాడు.
* ‘108’ మాటున అరబిందో సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆధారాలు బయటపెట్టారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వైద్యసేవలు అందాల్సిన 18 లక్షల మందికి అంబులెన్స్‌లు అత్యవసర సేవలు అందించలేకపోయాయని మండిపడ్డారు. మొత్తం 34 లక్షల మంది బాధితులకు గానూ 17.8 లక్షల మందికి గోల్డెన్ అవర్ సమయంలో చేరలేకపోయాయని ఆడిట్ జనరల్ తప్పుబట్టిందన్నారు. 61 శాతం అంబులెన్స్‌లో సెలైన్ల కొరత, ఫస్ట్ ఎయిడ్ కిట్ల కొరత ఉన్నట్లు కాగ్ నిర్ధరించిదని గుర్తు చేశారు. విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరబిందో సంస్థ 430 అంబులెన్స్‌లు నడిపినప్పటికీ.. 720 అన్నట్లు చూపించారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో అంబులెన్స్‌లకు చట్టాలు వర్తించవా? అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకున్న సంస్థపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
* ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024 తదితర ఏడు కీలక బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకొచ్చిన బిల్లు సభ ఆమోదం పొందింది. ఎన్టీఆర్ హెల్ వర్సిటీ సవరణ బిల్లు-2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు-2024 బిల్లులను శాసనసభ ఆమోదించింది. వీటితోపాటు ఏపీ సహకార సంఘం సవరణ బిల్లు-2024నూ శాసనసభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.
* విజయనగరంలో భూముల అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ సీఎం చంద్రబాబుకు మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. విజయనగరంలో భూములు కొట్టేశారంటూ లేఖలో ప్రస్తావించారు. ఆరోపణలున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై విచారణ జరపాలని కోరారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు కూడా ఇదే లేఖ పంపించారు.
* సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తితిదే (TTD News) నిర్ణయించింది. తితిదేలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ మేరకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని నిర్ణయించారు. బీఆర్ నాయుడు తన తొలి సమావేశంలోనే సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 3:30 గంటలకు వరకు సుదీర్ఘంగా కొనసాగింది. అజెండాలోని 80 అంశాలను పరిశీలించి సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు. గత ఐదేళ్లలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి కొన్నింటిని రద్దు చేశారు. సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ‘‘ తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తాం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తాం. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z