* మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డి(YS Avinash Reddy)కి సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. అప్రూవర్‌ను శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించాడని వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. ఈ కేసులో శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి నోటీసులు ఇచ్చింది. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
* ఆహారాన్ని బాగా నమిలి తినేవారిలో మూడు నెలల గ్లూకోజు మోతాదుల సగటు (హెచ్‌బీఏ1సీ) 7.48 శాతంగా ఉండగా.. అంతగా నమలని వారిలో 9.42 శాతం ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ బఫెలో పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అంటే సుమారు 2% ఎక్కువగా ఉంటోందన్నమాట. మధుమేహం గలవారిలో హెచ్‌బీఏ1సీ మోతాదులు ఒక శాతం పెరిగితే గుండెజబ్బుల ముప్పు 40% పెరుగుతుండటం గమనార్హం. గ్లూకోజు మోతాదులు దీర్ఘకాలంగా ఎక్కువగా ఉంటుంటే కిడ్నీలు, కళ్లు, నాడులు దెబ్బతినే ప్రమాదమూ ఉంది. పుండ్లు పడితే త్వరగా మానవు కూడా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆహారాన్ని పూర్తిగా నమలి తినటం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. మందులు వేసుకోవటంతో పాటు ఈ చిన్న జాగ్రత్తను పాటిస్తే చాలా ప్రయోజనం చేకూరుతుంది.
* రహదారుల నిర్వహణపై వినూత్నంగా ఆలోచించానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగించే యోచన చేస్తున్నట్టు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేసేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. ‘‘ఐదేళ్లలో రాష్ట్రంలో రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయి. రోడ్ల మరమ్మతులకు రూ.850 కోట్లు మంజూరు చేయడంతో పనులు జరుగుతున్నాయి. జనవరిలో పండుగల సందర్భంగా రాష్ట్రానికి ఎవరైనా వస్తే మెరుగైన రహదారులు కనిపించాలనే ఉద్దేశంతో.. దృఢ సంకల్పంతో ముందుకుపోతున్నాం. మన దగ్గర డబ్బుల్లేవు.. ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన దేశాన్ని, ప్రపంచాన్ని మారుస్తుంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల్లో ఉన్న రోడ్ల నిర్వహణ జాతీయ రహదారుల మాదిరిగా టెండరు పిలిచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇస్తాం. గ్రామం నుంచి మండల కేంద్రానికి ఎక్కడా టోల్ ఫీజు ఉండదు. మిగిలిన చోట్ల టోల్ ఉంటుంది.. అది కూడా బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే యూజర్ ఛార్జి ఉటుంది. ఈ విధానం బాగుంటుందని సభ్యులంతా భావిస్తే ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాల్లో అమలు చేద్దాం’’ అని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు.
* ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో కొంతకాలంగా హింసాత్మక ఘటనలు (Manipur violence) చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన సీఎం బీరేన్ సింగ్.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ హయాంలో లోపాలను ఎత్తి చూపారు. మణిపుర్‌లో నెలకొన్న పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వామే అంటూ మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ఆరోపించారు. దీనిపై బీరేన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయా. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితికి నన్ను బాధ్యుడిని చేయడం ఆమోదయోగ్యం కాదు. నిజానికి కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పులే ఈ పరిస్థితి కారణం’’ అని ఆరోపించారు.
* వరంగల్‌ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని సీఎం రేవంత్ (Revanth Reddy) రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్ (Warangal)ను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ జిల్లా మంత్రి, ఇన్‌ఛార్జ్ మంత్రి పట్టుబట్టి అభివృద్ధి పనులను సాధించుకున్నారని చెప్పారు. ఏడాది పాలన పూర్తి సందర్భంగా హనుమకొండ (hanumakonda)లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు. విమానాశ్రయంతో వరంగల్ రూపురేఖలు మారనున్నాయన్నారు. చాలా రాష్ట్రాల్లో నాలుగైదు విమానాశ్రయాలు ఉన్నాయని.. తెలంగాణ (Telangana)లో మాత్రం ఇప్పటివరకు ఒకేఒక ఎయిర్‌పోర్టు ఉందన్నారు. గత ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తుంటే పనులు చేస్తుంటే కుట్రలు, కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin).. త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. పర్యటనకు సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదని.. వీటిపై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. అయితే, వచ్చే ఏడాది ఆరంభంలో ఈ భేటీ ఉండనున్నట్లు తెలుస్తోంది.
* ఏపీ అసెంబ్లీకి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కుమార్తె నర్రెడ్డి సునీత (Narreddy Sunitha) వచ్చారు. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు కార్యాలయానికి వెళ్లారు. సీఎంవో అధికారులను కలిసి వివేకా హత్యకేసు పురోగతిపై ఆరా తీశారు.
* విశాఖలో లా స్టూడెంట్ అత్యాచార ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడిన మంత్రి.. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ మంత్రికి తెలిపారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అనిత తెలిపారు.
* పోలవరం.. రాష్ట్రానికి జీవనాడి.. వెన్నెముక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే కరవుకు చెక్ పెట్టినట్లే అని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై లఘు చర్చలో భాగంగా అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను రెండు కళ్లుగా భావించినట్లు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదనే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామన్నారు. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతుందని.. పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. నీటి సంరక్షణకు చర్యలు తీసుకుందామని.. సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
* ఇజ్రాయెల్ దాడులతో గాజాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంక్షుభిత ప్రాంత ప్రజలకు అందిస్తున్న మానవతా సాయానికి తీవ్ర ఆటంకం కలిగింది. ఆహార సామగ్రిని తరలిస్తున్న ట్రక్కులను కొందరు దుండగులు హింసాత్మంగా లూటీ (Gaza Aid Trucks Looted ) చేశారు. మొత్తం 109 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు తరలిస్తుండగా.. డ్రైవర్లపై తుపాకీ ఎక్కుపెట్టి 97 ట్రక్కుల్లోని సరకును కాజేశారని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ (UNRWA ) ఆరోపించింది. శనివారం జరిగిన ఈ దాడిలో సహాయ సిబ్బందికి గాయాలయ్యాయని, ట్రక్కులు దెబ్బతిన్నాయని వెల్లడించింది.
* భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాట ఇచ్చి.. పదేళ్లలో రుణమాఫీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లోనే రుణమాఫీకి రూ.18వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఒక్కసారి ఓడిస్తే.. మళ్లీ ప్రజల మొహం చూడరా? అధికారం ఇస్తే దోచుకోవడం.. ఓడిస్తే ఫామ్‌హౌస్‌లో కూర్చోవడమేనా మీ పని అని ప్రశ్నించారు. ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకు రావడం లేదని నిలదీశారు. నిజంగా ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ల మధ్యకు వచ్చి ఎందుకు అడగటం లేదన్నారు. రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు. మూడుసార్లు అధికారం దక్కకపోయినా.. రాహుల్ గాంధీ ప్రజల మధ్యే ఉన్నారని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతను ఎందుకు నిర్వర్తించడం లేదని నిలదీశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z