NRI-NRT

న్యూజెర్సీలో వైభవంగా TFAS 40వ వార్షికోత్సవం-దీపావళి

న్యూజెర్సీలో వైభవంగా TFAS 40వ వార్షికోత్సవం-దీపావళి

భాషే సాంస్కృతిక వారధి అని తెలుగు కళా సమితి(TFAS) అధ్యక్షులు మధు అన్నా పేర్కొన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో TFAS 40 వసంతాల వేడుకలు-దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మన్నవ సుబ్బారావు, ఉపేంద్ర చివుకుల, బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ అధ్యక్షులు మోహన్ రావు మైనేని, శంకరమంచి రఘుశర్మ, స్వాతి అట్లూరిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మ్యూజికల్ నైట్, ఫ్యాషన్ షో, సాహిత్య పోటీలు జరిగాయి. క్రికెట్, వాలీబాల్, టెన్నీస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రముఖ కమెడియన్ శివారెడ్డి మిమిక్రీ ప్రదర్శనతో పాటు సింగర్లు భరద్వాజ్, సంగీత దర్శకుడు చరణ్ పాకాల లైవ్ ప్రోగ్రాం ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో శేషగిరి కంభంమెట్టు, ప్రసాద్ వూటుకూరి, వాణి కూనిశెట్టి, లత మాడిశెట్టి, దాము గేదెల, వాసిరెడ్డి రామకృష్ణ, మందాడి శ్రీహరి, భీమినేని శ్రీనివాస్, భాను మాగులూరి, రమేష్ అవిర్నేని, లోకేందర్ గిర్కాల, అరుంధతి శాకవల్లి, వెంకట సత్య తాతా, వరలక్ష్మి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z