తెలుగు రాష్ట్రాల్లో వేల మంది వికలాంగులకు అండగా నిలుస్తున్న అమెరికాకు చెందిన హోఫ్4స్పందన సేవా సంస్థ ఆధ్వర్యంలో అనంతపురంలోని కాటగానికాలువ గ్రామంలో నిర్మిస్తున్న అనాధశ్రమానికి నాట్స్ సంస్థ చేయూతనిందించినట్లు అధ్యక్షుడు మదన్ పాములపాటి, బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేనిలు తెలిపారు. ఏకాంశ సంస్థ కూడా ఈ కార్యక్రమానికి చేయూతనందించింది. 70 శాతం పూర్తయిన ఈ ఆశ్రమం అనాధ మానసిక వికలాంగులకు ఆలంబనగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. లక్ష్మీ నరసింహ, కృష్ణారెడ్డిలను అభినందించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z