ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియోతో కలిసి దోహా మ్యూజిక్ లవర్స్ దోహాలో సూపర్ డాన్సర్ కాంపిటీషన్ (సీజన్ 3) గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. పిల్లలు, సబ్-జూనియర్లు, జూనియర్లు, యుక్తవయస్కులు, సీనియర్ల విభాగాల్లో 80 మంది తుదిసమరంలో తమ ప్రతిభతో అలరించారు.
దోహా మ్యూజిక్ లవర్స్ ప్రెసిడెంట్ సయ్యద్ రఫీ, ఎమోట్ ఎడిషన్ డ్యాన్స్ స్టూడియో డైరెక్టర్లు జ్యోతి-సంగీత, కోడూరు శివరామ్ ప్రసాద్, కృష్ణ కుమార్, ఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శి నాజియా అహమ్మద్, హరీష్ రెడ్డి, సంతోష్, న్యాయనిర్ణేతలు శరత్ నాయర్, మనోజ్ కుమార్, గినేష్, రేఖ, స్వప్న, భావన, మామణి, సయ్యద్ రఫీ బృంద సభ్యులు రవి, సారా అలీ ఖాన్, బాసిత్ పఠాన్, అబ్దుల్ అసిమ్, విశాలాక్షి నారా, నూర్ అఫ్షాన్ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z