* పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు .. ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. విజయవాడలోని పోరంకిలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ‘తారక రామం- అన్నగారి అంతరంగం’ పుస్కకాన్ని ఆవిష్కరించారు.ఎన్టీఆర్ (NTR) తొలి సినిమా మనదేశం 1949లో విడుదలై ఇప్పటికి 75 సంవత్సరాలైన సందర్భంగా ఆయన సినీ నట వజ్రోత్సవాల్ని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘తారకరామం-అన్నగారి అంతరంగం’ శీర్షికతో ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్సైట్’ కమిటీ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. విజయవాడలోని పోరంకిలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెదేపా రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఛైర్మన్‌గా ఉన్న ‘ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్సైట్’ కమిటీ ఈ వేడుకల్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సినీనటి జయప్రద, నిర్మాత డి.సురేష్‌బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నందమూరి రామకృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు.
* నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడేనని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని వ్యాఖ్యానించారు.
* దొడ్డి కొమురయ్య రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కోకాపేట్లో నూతనంగా నిర్మించిన దొడ్డి కొమురయ్య కురుమ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
* తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని భారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.
* భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న వెంకట దత్త సాయిని ఆమె వివాహం చేసుకోనుంది. కాగా.. శనివారం (డిసెంబరు 14న) సింధు, వెంకటసాయిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
* సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన తాజా విజన్-2047 ఆచరణకు పనికి రాని ఒక డ్రామా అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఒక స్వయం ప్రకటిత విజనరీ అని, గతంలో ఆయన ప్రకటించిన రెండు విజన్లలోని లక్ష్యాలను ఏ మేరకు సాకారం చేశారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విజన్ అంటేనే పేదవారి విధ్వంసంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
* అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ‘డొనాల్డ్ ట్రంప్’ (Donald Trump) 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికాలోని సుమారు 18,000 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) గణాంకాల ప్రకారం.. 10.45 లక్షల మంది చట్ట విరుద్ధంగా అమెరికాలో ఉన్నట్లు, ఇందులో 17,940 మంది ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన జాబితా సిద్దమైనట్లు సమాచారం. ట్రంప్ పదవి చేపట్టిన తరువాత వీరందరినీ వారి దేశాలకు పంపించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో.. చట్టపరమైన హోదాను పొందటం పెద్ద సవాలు. ఇలాంటి వారే చట్టపరమైన చర్యలలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి కేసుల నుంచి బయటపడటానికి సుమారు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. చాలామంది ఐసీఈ నుంచి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడే బ్యూరోక్రాటిక్ చిక్కుల్లో చిక్కుకుంటున్నట్లు సమాచారం. గత మూడేళ్ళలో సగటున 90,000 మంది భారతీయులు అమెరికా సరిహద్దులలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడినట్లు తెలుస్తోంది. వీరిలో చాలామంది పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చినవారే అని సమాచారం.
* భారత రాజ్యాంగం (Constitution of India) ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో (Lok Sabha) నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు. ప్రజాస్వామ్య పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఇవి దేశం గర్వపడే క్షణాలని అన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నించిందని విమర్శలు గుప్పించారు.
* టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి బన్నీ గొప్ప బహుమతి ఇస్తే.. అరెస్ట్ చేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందంటూ విమర్శించారు. ‘తెలంగాణ నివాసి అయిన అల్లు అర్జున్ భారత్‌లోనే బిగ్గెస్ట్ స్టార్. భారతీయ సినిమా చరిత్రలో భారీ హిట్ కొట్టి రాష్ట్రానికి గొప్ప బహుమతి అందిచారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయనను జైలుకు పంపి బన్నీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది’ అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
* భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలం భక్తులతో సందడిగా కనిపించింది. వరుసగా సెలవులు రావడంతో క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. మార్గశిర మాస పౌర్ణమి ప్రత్యేక శోభ సంతరించుకున్నది. ఈ క్రమంలో ఆలయ వీధులన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. వరుసగా వారాంతపు సెలవులు కలిసిరావడంతో కుటుంబసమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z