మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శుక్ర, రవి, శని గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అయి, మానసికంగా ఊరట కలుగుతుంది. కొందరు ఇష్టమైన బంధువులతో విందులో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు బాగా నమ్మకం పెరిగి ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితుల సానుకూలంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో బాగా లాభాలు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): దశమ, భాగ్య స్థానాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సూచనలున్నాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. బంధువు లతో అపార్థాలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారానికి సంబంధించి శుభవార్త వింటారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శుక్ర, రాహువు, రవి, కుజులు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గురు, శుక్ర, బుధుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల శుభ కార్యాలకు మార్గం సుగమం అవుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా మారు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో చక్కబడతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ది చెందుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): చతుర్థ స్థానంలో రవి, బుధ గ్రహాలు కలిసి ఉండడం వల్ల కొద్ది ప్రయత్నంతో కొన్ని ముఖ్యమైన సమస్యలను, వివాదాలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలన్నీ తేలికగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు అతిగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు పనికి వస్తాయి. ఆస్తి వివాదం రాజీమార్గంలో పరిష్కార మయ్యే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): గురువు, శని, శుక్ర, కుజ గ్రహాల అనుకూలత వల్ల జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలతో పాటు, ఆర్థిక సమస్యల నుంచి కూడా చాలావరకు బయట పడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఉత్సాహంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధమైన విషయాలకు సమయం బాగా అను కూ లంగా ఉంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశిం చిన స్థాయిలో లాభాలు గడిస్తారు. వినోద యాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తిపరంగా సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. వాహన ప్రమాదాలకు కొద్దిగా అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుక్ర, రవి, బుధ గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగ జీవితంలో కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించడం, జీతభత్యాలు పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. తీవ్రస్థాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు మనసులోని కోరికలు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొందరు బంధుమిత్రు లతో విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం గౌరవప్రదంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): గురు, బుధ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యక్తిగతంగా ఒకటి రెండు సానుకూల సంఘ టనలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి బాగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శని, శుక్ర గ్రహాల అనుకూలత వల్ల ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసు కుంటాయి. డాక్టర్లు, లాయర్లకు తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టు దలగా పూర్తి చేస్తారు. స్నేహితుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. నిరు ద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు నిలకడగాఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశిలో శుక్రుడి సంచారంతో పాటు, లాభస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆదా యం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు, ఒత్తిళ్లు తగ్గి జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోయే అవకాశం కూడా ఉంది. ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు బాగా కలిసి వచ్చే సమయం కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయుడం జరుగుతుంది. కొందరు బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): దశమ స్థానంలో బుధ రవుల సంచారం కారణంగా ఉద్యోగ జీవితంలో ఆదరణ, ప్రోత్సాహంతో పాటు గౌరవ మర్యాదలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. తొందరపాటు వైఖరిని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): లాభ స్థానంలో ఉన్న శుక్ర గ్రహం, భాగ్య స్థానంలో బుధ, రవులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాలను ఇస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగు తాయి. సొంత నిర్ణయాల కంటే ఇతరుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ మాటకు బాగా విలువనిస్తారు. వ్యాపారాలు ఉత్సా హంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. కొందరు మిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z