Sports

₹11కోట్లకు ₹4.67కోట్ల పన్ను-BusinessNews-Dec 16 2024

₹11కోట్లకు ₹4.67కోట్ల పన్ను-BusinessNews-Dec 16 2024

* ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ‘ఎక్స్ మెయిల్’ పేరుతో ఈమెయిల్ ప్రారభించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం. ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక యూజర్ ట్వీట్ చేస్తూ.. ఎక్స్.కామ్ ఈమెయిల్ కలిగి ఉండటం ఒక్కటే, నన్ను జీమెయిల్ ఉపయోగించకుండా ఆపగలదని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. ఈమెయిల్‌తో సహా మెసేజింగ్ మొత్తం ఎలా పని చేస్తుందో మనం పునరాలోచించాలని మస్క్ అన్నారు. 2024 సెప్టెంబర్ నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్లో.. యాపిల్ మెయిల్ 53.67 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత జీమెయిల్ 30.70 శాతం, అవుట్‌లుక్ 4.38 శాతం, యాహూ మెయిల్ 2.64 శాతం, గూగుల్ ఆండ్రాయిడ్ 1.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మస్క్ కూడా ఎక్స్.మెయిల్ ప్రారంభించే యోజనలో ఉన్నారు. కాబట్టి ఈ రంగంలో కూడా మస్క్ తన హవా చూపించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది.

* వరల్డ్ చెస్ పెడరెషన్ (ఫిడే) ప్రకారం.. చెస్ ఛాంపియ‌న్‌షిప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.20.75 కోట్లు. ఒక గేమ్ గెలిచిన వారికి రూ.1.68 కోట్లు ఇస్తారు. ఇలా గుకేష్ మూడు గేమ్స్ గెలిచాడు. ఈ లెక్కన మొత్తం రూ.5.04 కోట్లు గుకేష్ సొంతమయ్యాయి. రెండు గేమ్స్ గెలిచిన డింగ్‌కు రూ. 3.36 కోట్లు దక్కాయి. అంటే మొత్తం ఛాంపియ‌న్‌షిప్ ప్రైజ్ మనీతో ఇద్దరు ఆటగాళ్లు రూ.8.40 కోట్లు కైవసం చేసుకోగా.. మిగిలిన రూ.12.35 కోట్లను ఇద్దరికీ సమానంగా పంచుతారు. ఇలా గుకేశ్‌కు రూ.11 కోట్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ అందుతుంది. గుకేశ్‌కు వచ్చిన ప్రైజ్ మనీతో 30 శాతం లేదా రూ.4.67 కోట్లు ట్యాక్స్ కింద కట్ చేస్తారు. ఈ లెక్కన మొత్తం పన్నులు చెల్లించిన తరువాత గుకేష్ చేతికి అంతేది రూ.6.33 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గెలిచింది గుకేష్ కాదు, ఆర్ధిక శాఖ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

* దేశంలో బంగారం ధరలు తగ్గుముఖంలో పయనిస్తున్నాయి. రెండు రోజులు వరుస భారీ తగ్గుదల తర్వాత రెండురోజులుగా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా సోమవారం (డిసెంబర్‌ 16) పసిడి రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఐదు రోజులుగా పుత్తడి ధరలు పెరగకపోవడంతో పసిడి ప్రియులు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,890 వద్ద ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,550 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.78,040 వద్ద కొనఉన్నాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.71,400, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,890 లుగా ఉన్నాయి.

* ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి జీఎస్‌టీ నోటీసులు జారీ చేసింది. కస్టమార్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్‌టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ పేర్కొనింది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా కంపెనీ తెలిపింది. మొత్తం రూ.803.4 కోట్ల జీఎస్‌టీ కట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.

* బ్యాంకుల అతిపెద్ద సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) అనేక సార్లు 5 రోజుల పనిని ప్రతిపాదించాయి. గ్లోబల్ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. పనితీరును రూపొందించడం, ఉద్యోగుల శ్రేయస్సును మెరుగుపరచడం, ఉత్పాదకతను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. డిసెంబరు 2023లో IBA, బ్యాంక్ యూనియన్‌ల మధ్య అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేశాయి. ఇందులో 5 రోజుల పని కోసం ప్రతిపాదన కూడా ఉంది. దీని తర్వాత, 8 మార్చి 2024న, ఐబీఏ, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) 9వ ఉమ్మడి నోట్‌పై సంతకం చేశాయి. ఈ నోట్‌లో శని, ఆదివారం సెలవులతో 5 రోజుల పనిని అమలు చేయడానికి బ్లూప్రింట్ సమర్పించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే, బ్యాంకు శాఖలను సందర్శించేందుకు కస్టమర్లు ముందుగానే తమ ప్రణాళికలను మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కస్టమర్లు సమస్యలను ఎదుర్కోవచ్చు. అయితే, 5 రోజులు పని చేయడం వల్ల కస్టమర్ సర్వీస్ అవర్స్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని బ్యాంకు యూనియన్లు హామీ ఇచ్చాయి. ఇందుకోసం బ్యాంకు శాఖల సమయాన్ని దాదాపు 40 నిమిషాలు పెంచడంతోపాటు డిజిటల్ సేవలను బలోపేతం చేయనున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z