NRI-NRT

యూకెలో వైభవంగా వెంకన్న కళ్యాణం

యూకెలో వైభవంగా వెంకన్న కళ్యాణం

శ్రీ వేంకటేశ్వర బాలాజీ టెంపుల్ & కల్చరల్ సెంటర్ (SVBTCC) ఆధ్వర్యంలో బ్రాక్క్నేల్, యూ.కేలో ఆదివారం నాడు శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వైఖానస ఆగమ నియమాల ప్రకారం నిర్వహించిన ఈ క్రతువులో స్థానిక పాలక వర్గ సభ్యులు – కౌన్సిలర్ ఇస్కందర్ జెఫరీస్, పార్లమెంట్ సభ్యుడు పీటర్ స్వాలో తదితరులు పాల్గొన్నారు. భక్తులు శ్రీవారికి పుష్పాలు, పత్రాలు, నూతన వస్త్రాలు, నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ప్రసాద వితరణ, సాంప్రదాయ సంగీత, నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ కోడూరి నిరంజన్, సహాయ కన్వీనర్ మస్తీ ప్రవీణ్ ఏర్పాట్లను సమన్వయపరిచారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z