NRI-NRT

సింగపూర్ ప్రవాసులతో కిరణ్ ప్రభ ఇష్టాగోష్టి

సింగపూర్ ప్రవాసులతో కిరణ్ ప్రభ ఇష్టాగోష్టి

శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూరు ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త కిరణ్ ప్రభ దంపతులతో ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌముది మాసపత్రిక సంపాదకులుగా, కిరణ్ ప్రభ టాక్ షో ద్వారా ఆయన సుపరిచితులు. కిరణ్ ప్రభ ఇప్పటివరకు 1300కు పైగా టాక్ షోలను నిర్వహించారు. వీటికి యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభించింది. తన టాక్ షోలు కేవలం తెలుగు భాష మీద అభిమానంతో మాత్రమే చేస్తున్నానని కిరణ్ ప్రభ అన్నారు.

నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు, సుబ్బు పాలకుర్తి, సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్ష్యులు జవహర్ చౌదరి, రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్ వీరా, ధనుంజయ్ రెడ్డి, రామాంజనేయులు చామిరాజు, పాతూరి రాంబాబు, సునీల్ రామినేని, కోణాళి కాళీ కృష్ణ, రాధాకృష్ణ గణేశ్న, కేశాని దుర్గా ప్రసాద్, సురేంద్ర చేబ్రోలు, మోహన్ నూకల తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z