ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల్లోని జనాభా మిగతా దేశాల జనాభా కంటే ఎక్కువ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నట్టు తాజాగా ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. అందుకు సంబంధించిన కారణాలనూ అందులో తెలిపింది. ఆ దేశాల్లో ఆదాయం కంటే ఆరోగ్యం, ఆహారానికే పెద్దపీట వేస్తారట. డెయిరీ ఉత్పత్తులూ, బ్రెడ్డూ, చేపలూ, బెర్రీలూ, ఆపిల్సూ, క్యాబేజీ, దుంపకూరలూ, పోర్క్ వంటివి నిత్యం తీసుకుంటారట. కొవ్వులున్న ఆహారాన్ని అస్సలు పక్కన పెట్టరని ఆ పత్రిక వెల్లడించింది. ఎందుకంటే ఆ దేశస్థులు వ్యాయామానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారట. అలానే ఎక్కువగా ప్రకృతిలో గడుపుతూ ఒత్తిడి లేకుండా వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను సమన్వయం చేసుకోవడంలో ముందుంటారట. ఆరోగ్యం విషయంలో ఆయా దేశాల ప్రభుత్వాలూ బాధ్యతగా వ్యవహరిస్తాయనీ అందుకే ఆ దేశాల్లోని వారు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నారనీ ఫోర్బ్స్ పత్రిక చెప్పుకొచ్చింది.
ఆరోగ్యవంతమైన దేశాల్లో ఫిన్లాండ్ నెం.1
Related tags :