ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) “రైతు కోసం తానా” కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాకలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని పెదకడిమి, రామచంద్రపురానికి చెందిన పేద రైతులకు పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లను అందజేశారు. చలపతిరావు స్మారకార్థం ఆయన సతీమణి సునీత ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించారు. మేకా సతీష్, ఎన్.సుధీర్, కొప్పాక సర్పంచ్ దీక్షితులు, పెదకడిమి సర్పంచ్ బలరామకృష్ణచౌదరి, ఎం.ఈ.ఓ అరుణ్, హెచ్.ఎం. శైలజ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z