DailyDose

Free daily horoscope in Telugu – Jan 12 2025

Free daily horoscope in Telugu – Jan 12 2025

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వారమంతా అనేక విధాలుగా అనుకూలంగా సాగిపోతుంది. ముఖ్యంగా కుటుంబ జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నిటినీ చాలావరకు చక్కబెడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇబ్బందేమీ ఉండదు. తోబుట్టువులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభ వార్తలు వినే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కలుగుతాయి. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందు తాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ధనపరంగా ఎవరినీ అతిగా నమ్మవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. కొన్ని ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరుగు తుంది. స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో ప్రాధాన్యం ఉంటుంది. బరువు బాధ్య తలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఒక పట్టాన పూర్తి కాకపోవచ్చు. వృత్తి, వ్యాపా రాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబంలో కొద్దిగా విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు ఎదురవుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): దాదాపు అన్ని రంగాలవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. కుటుంబ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము వసూలవుతుంది. వృత్తి, వ్యాపా రాలు విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిపాటి విముక్తి లభిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహా రాల్లో దూసుకుపోతారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశీయానానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు, ఉద్యోగం మారాలనుకుంటున్నవారు విదేశాల నుంచి శుభ వార్తలు వినే సూచనలున్నాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అనుకోకుండా ఒకటి రెండు శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఊహిం చని యోగం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి, పురోగతి కనిపిస్తు న్నాయి. ఉద్యోగం మారే ప్రయత్నాల్ని వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినప్పటికీ ఫలితం ఉంటుంది. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసమేతంగా దైవ దర్శనాలకు వెళ్లడం జరుగుతుంది. విద్యార్థులు కష్టప డాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సోదరులతో వివాదాలు, అపార్థాలు చాలావరకు తగ్గిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి కొద్ది పాటి ఉపశమనం లభిస్తుంది. వృత్తి జీవితంలో ఉన్న వారికి విదేశాల నుంచి ఆఫర్లు అందే అవ కాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ద పెరుగుతుంది. విద్యార్థులు మరింతగా శ్రద్ధను, శ్రమను పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి, నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు. రావ లసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందు తాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ వారం ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ప్రతి పనీ సకాలంలో పూర్తవుతుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభించే సూచనలు న్నాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెడతారు. విద్యార్థులకు సునాయాసంగా విజయాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈవారం కొన్ని ఊహించని శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాలు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి సంపద లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధు వులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లలు చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ప్రేమ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వారమంతా చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. కొద్ది శ్రమతో ప్రతి ప్రయత్నమూ నెరవేరు తుంది. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పని తీరుతో ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విశే షంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యా నికి ఇబ్బందేమీ ఉండదు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు వసూలవుతాయి. ఆస్తి సంబంధమైన వివాదాలు చక్కబడతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తాయి. ఉద్యో గపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో పని భారం కొద్దిగా తగ్గుతుంది. కొన్ని బరువు బాధ్యతల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మాత్రం విపరీతంగా యాక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుం టారు. ప్రధాన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కానీ, ఖర్చులు, ఉచిత సహాయాలు తగ్గించుకోవడం మంచిది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కొద్దిగా అనారోగ్యాలు బాధిస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి తలెత్తుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థిక వ్యవహారాలు సజావుగా, సవ్యంగా సాగిపోతాయి. కొద్దిగా ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచ నలున్నాయి. ఆర్థికపరంగా కొన్ని అనుకూలతలు కలిగే అవకాశం ఉంది. సొంత ఇంటి కోసం ప్రయ త్నించడానికి సమయం అనుకూలంగా ఉంది. దైవ కార్యాల మీద ఖర్చు పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ మీద కానీ ఉత్తమ ఫలితాలు కనిపించవు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాలపరంగా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందుల నుంచి చాలావరకు గట్టెక్కుతారు. వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలంగానే సాగిపోతాయి. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల నుంచి ఆశిం చిన సహాయం అందకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో కొద్దిగా ఇబ్బందులు ఎదు ర్కొంటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కొత్త లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో కుటుంబ బాధ్యతలను పంచుకుంటారు. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z