NRI-NRT

న్యూజెర్సీలో మన్నవ అభినందన సభ. వేలాదిగా తరలివచ్చిన ప్రవాసులు.

న్యూజెర్సీలో మన్నవ అభినందన సభ. వేలాదిగా తరలివచ్చిన ప్రవాసులు.

ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పోరేషన్ (APTS) ద్వారా ఏపీలోని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి వాటిపై దృష్టి సారిస్తానని ఆ సంస్థ ఛైర్మన్, ప్రవాసాంధ్రుడు మన్నవ మోహనకృష్ణ అన్నారు. APTS ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అమెరికాకు తొలిసారి వచ్చిన ఆయనకు వారాంతంలో న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్‌లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాలులో ఆయన ప్రవాస మిత్రమండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మోహనకృష్ణ ప్రసంగించారు.

“నా మీద అభిమానంతో అమెరికా నలుదిశల నుండి నాకు శుభాకాంక్షలు తెలిపే నిమిత్తం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రవాసులు ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ నా సామర్థ్యాన్ని గుర్తించి ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేసేందుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్న ఏపీ నైపుణ్యాన్ని మన రాష్ట్రాభివృద్ధికి ఎలా వినియోగించుకోవాలో ప్రణాళికలు రూపొందిస్తున్నాము. రాష్ట్రంలో అన్ని రంగాల్లో టెక్నాలజీని విస్తృతపరచటానికి కృషి చేస్తాను. ఏపీలో ప్రవాసులు పెట్టుబడులు పెట్టాలి. నా ప్రజాజీవితంలో పలు విజయాలను అందుకునేందుకు ప్రవాసులు ఎంతగానో తోడ్పడ్డారు.వారికి నా కృతజ్ఞతలు.” అని మోహనకృష్ణ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z