అయోధ్య రాముడికి తితిదే ఛైర్మన్ బి.ఆర్. నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. సతీసమేతంగా అయోధ్య ఆలయం (Ayodhya Ram Mandir) వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ బృందం స్వాగతం పలికింది. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఆలయంలోని వెళ్లి అయోధ్య రాముడికి పట్టువస్త్రాలు సమర్పించారు. తితిదే బృందానికి అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే (TTD) బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీరామ్ రఘునాథ్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, అర్చకులు గోపీనాథ్ దీక్షితులు, బొక్కసం ఇన్ ఛార్జి గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z