NRI-NRT

ఎన్‌టీఆర్‌కు సింగపూర్ ప్రవాసుల నివాళి

ఎన్‌టీఆర్‌కు సింగపూర్ ప్రవాసుల నివాళి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్థంతిని పురస్కరించుకుని సింగపూర్‌లోని తెలుగుదేశం ఫోరం సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్‌ చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలుగు ప్రజలపై ఆయన చూపిన ప్రేమ, తెలుగుజాతి మీద గౌరవంతో ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనియాడుతూ నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వారికి సింగపూర్ తెలుగుదేశం ఫోరం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఆతిథ్యంతో భోజన ఏర్పాటు చేసిన సరిగమ రెస్టారంట్ వారికి ఫోరమ్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z