మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రాశ్యధిపతి కుజుడు, గురువు, శనీశ్వరుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశముంది. ఆస్తి లాభం కలుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక వ్యవహారాలు పురోగతి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. జీతభత్యాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. దైవ కార్యాలు, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరగవచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు, లాభంలో రాహువు, భాగ్య స్థానంలో రవి బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా పదోన్నతి దక్కే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు ఉద్యోగా వకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. అనుకోని ధన లాభా నికి అవకాశముంది. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రాశ్యధిపతి బుధుడు, శుక్రుల వంటి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. పేరు ప్రఖ్యాతులు పెరిగే పనులు చేస్తారు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారులకు రాబడి బాగా పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
గురు, రవి, కేతువుల అనుకూలత వల్ల ఆదాయం ఆశించినంతగా వృద్ధి చెందుతుంది. కొద్ది ప్రయ త్నంతో కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభముం టుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
దశమంలో ఉన్న గురువు కారణంగా ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పంచమంలో బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ఒకటి రెండు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయ పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
బుధ, గురు, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఎదురు చూస్తున్న శుభవార్తలను విన డం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ అనుకు న్నట్టు పూర్తవుతాయి. ప్రతి ప్రయత్నంలోనూ కొద్దిగా వ్యయప్రయాసలున్నప్పటికీ పట్టుదలగా వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. లాభాలపరంగా వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి సాధి స్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
బుధ, రవి, శుక్ర అనుకూలంగా ఉన్నందువల్ల విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వివాహ, ఆదాయ ప్రయత్నాలతో సహా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూలతలు పెరుగుతాయి. పనితీరుకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. బంధువులతో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
రాశ్యధిపతి శుక్రుడు, రాహువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం పెరుగుతుంది. అవసరాలు తీరిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపో తుంది. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
శని, బుధ, రవి,, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా విజయవం తంగా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ జీవితం కూడా చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా పురోగమిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో అంచనాకు మించిన లాభాలు కలుగుతాయి. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు .ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శని, శుక్ర, రాహువు, గురు గ్రహాల అనుకూల సంచారం కారణంగా అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంసుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. లాభదా యకమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారు లకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
శుభ గ్రహాలైన బుధ, శుక్రుల అనుకూలత వల్ల కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. కొద్ది ఖర్చుతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రాశ్యధిపతి గురువు, లాభ స్థానంలో రవి, దశమ స్థానంలో బుధుడి సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతి లభించడం, ప్రాధాన్యం పెరగడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా అభి వృద్ధి బాటలో సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశముంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వివాదాలు సవ్యంగా చక్కబడతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z