వార ఫలాలు (జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1, 2025 వరకు):
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి గురు, శనులు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాలలో డిమాండ్ బాగా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో చాలావరకు మంచి జరగడానికి అవకాశం ఉంది. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. ఆస్తి విషయాలు కూడా అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంత సంస్థల నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే సూచనలు న్నాయి. మంచి పరిచయాలు కలుగుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక విషయాల్లో కొద్దిగా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక సమస్యల పరి ష్కారానికి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గే సూచనలున్నాయి. రాశ్యధిపతి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నందువల్ల సమాజంలోని ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటుండదు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పనిభారం ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు అందివస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితమే కాకుండా ఇంటా బయటా కూడా ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. రాశ్యధిపతి బుధుడు సప్తమ స్థానంలో సంచారం వల్ల ఇంటా బయటా అనుకూలతలతో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. బంధువుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. మిత్రులతో విందులు, వినో దాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు తప్పకుండా ఉద్యోగంలో ప్రవేశించడం జరుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
లాభ స్థానంలో ఉన్న గురువు వల్ల ఆదాయానికి, గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పదోన్నతికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. సప్తమ స్థానంలో ధనాధిపతి రవి సంచారం వల్ల అనుకోని అదృష్టం పడుతుంది. ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. శత్రు, రోగ, రుణ సమ స్యలు బాగా తగ్గి ఉంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలుపెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికారులు బాగా ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో కొద్దిపాటి సమస్యలున్నా వాటిని అధిగమిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. గతంలో ప్రయత్నించిన పెళ్లి సంబంధం ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో శని, శుక్రుల కలయిక వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా, లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మి ఆర్థిక బాధ్యతలను అప్పగించవద్దు. ఆస్తి వివాదంలో కుటుంబ పెద్దల నుంచి ఆశించిన సలహాలు లభిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
భాగ్య స్థానంలో గురు సంచారం సాగుతున్నంత కాలం ఈ రాశివారికి ఆదాయానికి కొరత ఉండక పోవచ్చు. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనా లను మించుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు అనేక అవకాశాలు లభిస్తాయి. రాశ్యధిపతి బుధువు పంచమ స్థాన సంచారం వల్ల ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు బయట పడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి కొంత మనశ్శాంతి ఏర్పడుతుంది. కుటుంబసమేతంగా విహార యాత్ర చేసే అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. రాశ్యధిపతి శుక్రుడు పంచమంలో శనితో కలిసినందువల్ల ఏ ప్రయ త్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వివాదాలు అనుకూలంగా సాగిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన పనుల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. బంధువులకు ఆర్థికపరంగా సహాయ సహకారాలు అందజేస్తారు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబసమేతంగా ఆలయాలను సందర్శిస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో పని భారం బాగా ఎక్కువగా ఉంటుంది. అధికారులు మీ పనితీరుతో ఒక పట్టాన సంతృప్తి చెందరు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉంటుంది. తరచూ శివార్చన చేయించడం వల్ల కొన్ని కష్టనష్టాల నుంచి బయటపడగలు గుతారు. కొన్ని అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యు లతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు సజావుగా సాగిపోతుంది. ఒకరి ద్దరు బంధువులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనవసర ఖర్చులు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనేక అవకాశాలు అందివస్తాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటి లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో కొత్త మార్గాలు అనుసరిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. కొందరు సహచరుల వల్ల ఇబ్బంది పడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
అనుకోకుండా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యో గానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేయడం చాలా మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెంచడం వల్ల లాభాలు కలుగు తాయి. వృత్తి, ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు కూడా సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. పని భారం తప్పకపోవచ్చు. కుటుంబ విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు అనుకూలతలు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవు తాయి. కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ వ్యయప్రయాసలుంటాయి. ఏవీ ఒక పట్టాన పూర్తి కావు. ఇదే రాశిలో ఉన్న శని, శుక్రుల కారణంగా, ఆదాయానికి, గౌరవ మర్యాదలకు లోటుండదు. ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగించడం మంచిది. నిరుద్యోగులు మరింతగా ప్రయత్నాలు సాగిం చాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రుల వల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ధన వ్యయంతో పాటు ధన నష్టానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల లాభాలున్నప్పటికీ శ్రమ, ఒత్తిడి ఎక్కు వగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభకు, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా, లాభసాటిగా సాగిపో తాయి. బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బును వసూలు చేసుకుంటారు. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. వస్త్రాభ రణాలు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z