తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా – “ఘనమైన నా భారతదేశపు గణతంత్రదినోత్సవం (76వ) – ‘దేశభక్తి గీతాలతో భూమి భారతికి స్వర నీరాజనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “భారతదేశపు 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజునే తానా 76వ సాహిత్య కార్యక్రమం జరుపుకోవడం యాదృచ్చికమైనా సంతోషకరం. భరతభూమిసేవలో 4 దశాబ్దాలకు పైగా వివిధ ఉన్నతహోదాలలో విశిష్ట సేవలందించిన ఇద్దరు తెలుగువారు లెఫ్ట్నెంట్ జనరల్ కమ్ముల రామచంద్రరావు గారు, మేజర్ జనరల్ నందిరాజు శ్రీనివాసరావు పాల్గొని తమ అనుభవాలను పంచుకోవడం చాలా ఉత్తేజకరంగా ఉందని” అన్నారు. సామాజికసేవలో వందేళ్ళ ఆకాశవాణి పాత్రను ప్రముఖ గీత రచయిత, సంగీతదర్శకులు, ఆకాశవాణి విశ్రాంత కళాకారులు చక్కగా వివరించారు. ప్రముఖ గాయకులు ఎం.ఆర్.కె ప్రభాకర్, శీలం రమణ, మాధురి రావూరిలు దేశభక్తి గీతాలను ఆలపించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z