తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(TAL) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ ఆచారాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ వేడుకలు ఉల్లాసంగా సాగాయి. బొమ్మల కొలువు, భోగి పళ్ళు, రంగోలి పోటీ, వంటల పోటీ, గాలిపటాల తయారీ పోటీలు వంటి వివిధ కార్యక్రమాలలో ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా రెడ్‌బ్రిడ్జ్ కౌన్సిల్ మేయర్ కౌన్సిలర్ షీలా బెయిన్ హాజరయ్యారు. TAL సేవలను కొనియాడారు. మరో ముఖ్య అతిథి స్లవ్ మేయర్ కౌన్సిలర్ బల్విందర్ సంస్కృతిని యువతరానికి దగ్గరగా తీసుకురావడానికి, దానిని సజీవంగా ఉంచడానికి TAL కృషిని ప్రశంసించారు.
ఉమా గీర్వాణి, హిమబిందు, మృదుల, హరిక, స్వాతి, సంగీత, ప్రశాంతి, వేద, స్వప్న, హరిణి, రజని, అనిత, సింధు, వాణి, షాజ్మా, గిరిధర్, శ్రీధర్ ఎస్, రవి, రవి, బాలాజీ సి, లక్ష్మణ్, ఐటీ ఇన్‌ఛార్జి రాయ్ బొప్పన, మురళీ, విజయ్, వాజిద్, చరణ్, పవన్, వెంకట్, ప్రవీణ్, ట్రస్టీలు వెంకట్ నీల, శ్రీదేవి అలెద్దుల, రవి కుమార్ రెడ్డి మోచెర్ల, కోశాధికారి అనిల్ అనంతులలు వేడుకల ఏర్పాట్లను సమన్వయపరిచి సహకరించారు. వాలంటీర్లకు వైస్ చైర్మన్ కిరణ్ కప్పెట కృతజ్ఞతలు తెలిపారు. TAL కల్చరల్ సెంటర్ శిక్షణా తరగతులను ట్రస్టీ అశోక్ మాడిశెట్టి వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z