NRI-NRT

ఐర్ల్యాండ్‌లో ఇద్దరు ఏపీ విద్యార్థులు దుర్మరణం-NewsRoundup-Feb 01 2025

ఐర్ల్యాండ్‌లో ఇద్దరు ఏపీ విద్యార్థులు దుర్మరణం-NewsRoundup-Feb 01 2025

* ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్‌.పి ఠాకూర్‌ నియమితులయ్యారు. దిల్లీలోని ఏపీ భవన్‌ వేదికగా ఠాకూర్‌ పనిచేయనున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

* కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటో తేదీన లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను అందజేస్తున్నామని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం ముప్పవరంలోని ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, పాఠశాలల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.

* వికసిత్‌ భారత్‌ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్‌ (Union Budget) ఉందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ అవసరాలకంటే దేశం, ప్రజలు ముఖ్యం అనే సమున్నత దృక్పథం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కనిపించిందన్నారు. రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారని గుర్తు చేశారు.

* కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బడ్జెట్‌ కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌డీయే భాగస్వామ్య రాష్ట్రాలకే దక్కాయన్నారు. కేంద్ర జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉన్నప్పటికీ ఆమేరకు కూడా నిధులు కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు

* ఇజ్రాయెల్‌ (Israel) భీకర దాడులకు గాజా (Gaza) అతలాకుతలమైంది. పౌరుల జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆ ప్రాంతమంతా శిథిలాలతో నిండిపోయింది. ఈ క్రమంలోనే నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు (Palestinians) ఆశ్రయం కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) చేసిన ప్రతిపాదనలను అరబ్‌ దేశాలు (Arab nations) తిరస్కరించాయి. ‘‘పాలస్తీనీయులకు పునరావాసం కల్పించడానికి చేసే ప్రణాళికను మేం అంగీకరించలేం. ఎందుకంటే.. అలా చేసినట్లయితే ఆయా ప్రాంతాల్లోని స్థిరత్వాన్ని ఇది దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొనసాగుతున్న సంఘర్షణ విస్తరించే ప్రమాదమూ లేకపోలేదు. తద్వారా ప్రజలకు శాంతియుతంగా జీవించడం కష్టంగా మారుతుంది’’ అని ఈజిప్టు, జోర్డాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌, పాలస్తీనా అథారిటీ, అరబ్‌ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి.

* అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లను బీసీసీఐ నమన్‌ అవార్డు (BCCI Naman Awards)లతో సత్కరించింది. ముంబయిలో జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ఉత్తమ క్రికెటర్లకు పురస్కారాలు అందజేశారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో బీసీసీఐ గౌరవించింది. సీకే నాయుడు పేరుతో ఇస్తున్న ఈ పురస్కారానికి ఈ సారి సచిన్‌ ఎంపికయ్యాడు. 2023-24 సీజన్‌కు గాను ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌గా టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది.

* కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బడ్జెట్‌ కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌డీయే భాగస్వామ్య రాష్ట్రాలకే దక్కాయన్నారు. కేంద్ర జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతంగా ఉన్నప్పటికీ ఆమేరకు కూడా నిధులు కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రం నుంచి పన్నులు రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయి. గతంలో కంటే 12 శాతం మేర పెరిగినా రాజకీయ కారణాలతో తెలంగాణపై చిన్నచూపు చూశారు. భాజపాకు 8 మంది ఎంపీలను ఇచ్చినా తెలంగాణ ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసింది. బిహార్‌, దిల్లీ, ఏపీ, గుజరాత్‌ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం కక్ష సాధింపు కాదా? సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసి సహాయం కోసం అభ్యర్థించారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టు (76.4 కిలోమీటర్ల) విస్తరణకు కేంద్రం వాటాగా రూ.17,212 కోట్లు కేటాయించాలని కోరినా రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్, శివారు మున్సిపాలిటీలకు సీఎస్‌ఎంపీ కింద భూగర్భ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని విన్నవించుకున్నా బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా అన్యాయం చేశారు’’ అని పేర్కొన్నారు.

* జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్‌తో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. వరుసగా రెండో ఏడాది తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయిన బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

* ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మృతులను పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్‌, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి సాయిబాబా అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ప్యూరిఫైడ్‌ వాటర్‌ పరికరాల బిజినెస్‌ చేస్తున్నాడు. అతని పెద్ద కుమారుడు భార్గవ్‌ (25)ను ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం ఐర్లాండ్‌కు పంపించారు. అక్కడ కార్లోలోలని సౌత్‌ఈస్ట్‌ టెక్నాలజికల్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నారు. అలాగే పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన చెరుకూరి రామకోటయ్య పెద్దకుమారుడు సురేశ్‌ (26) ఉన్నత చదువుల కోసం ఏడాది కిందట ఐర్లాండ్‌కు వెళ్లారు. వీరిద్దరూ అక్కడే ఇద్దరు స్నేహితులయ్యారు. ఈ క్రమంలోనే శుక్రవారం (జనవరి 31) రాత్రి వీరిద్దరూ మరికొంతమంది స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. ఆ సమయంలో భారీగా మంచు కురవడంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారుతో సహా వారు లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో భార్గవ్‌, సురేశ్‌ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z